Astrology Remedies: మేష రాశి.. మేష రాశి వారికి కీలకమైన వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఊహించని విభేదాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా కష్టపాడాల్సి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. అనవసర ప్రయాణాలు తప్పవు. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.
కన్య రాశి..
ఆకస్మిక ప్రయాణ సూచనలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయి. . ఆప్తులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఎదుటి వారితో వాదనలకు దిగకపోవడమే బెటర్. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు స్థిరంగా సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
మకర రాశి..
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు కొంత మెల్లగా సాగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.
కుంభం రాశి..
వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరిచే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు అంతగా కలిసి వచ్చే అవకాశాలు లేవు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. దీపావళి నుంచి వీరి రాశిలో కీలక మార్పు చోటు చేసుకోనుంది.
తులా రాశి..
బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశాలున్నాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృధా ప్రయాణాలు తప్పవు.
మిధున రాశి..
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడే సూచనలున్నాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కునే అవకాశాలున్నాయి. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. బంధుమిత్రులతో కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు వస్తాయి.
Disclaimer (గమనిక):ఈ వ్యాసంలోని సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా న్యూస్ చెప్పడం లేదు. ఇవి ఆయా గ్రహాల సంచారంతో పాటు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతు ఉంటుంది. గ్రహ దోషాల నివారణ కోసం నవగ్రహ శ్లోకాలను జపించండి. ఇతర వివరాల కోసం.. జ్యోతిష్య పండితులు తంజావూర్ నాగరాజ శర్మ, ఈ మెయిల్ ID: tanarsharma@gmail.com, ఫోన్: 9395354502 సంప్రదించండి.