• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. పంట వేయకపోయినా ‘రైతు భరోసా’.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. పంట వేయకపోయినా ‘రైతు భరోసా’.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. రైతు భరోసా నిధులు కరువు నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగిలో పంటలు సాగు చేయకపోయినా రైతులకు రైతు భరోసా నిధులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 07, 2026, 09:14 AM IST|Updated: Nov 07, 2026, 09:18 AM IST
joinshare
తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. పంట వేయకపోయినా ‘రైతు భరోసా’.. సర్కార్ సంచలన నిర్ణయం!
Image Credit: Rythu Bharosa Yasangi Update

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

దీపావళి రోజు జూదం ఎందుకు ఆడతారో తెలుసా? పార్వతీ పరమేశ్వరుల పాచికల ఆట వెనుక అసలు కథ ఇదే!

2

AP MPTC ZPTC Results: ఏపీలో కౌంటింగ్ వేళ హైటెన్షన్.. పలుచోట్ల వాహనాల దగ్దం.. ఇరువర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్..

3

తమిళ సీఎం విజయ్ దీపావళి ధమాకా.. రూ. 100కే 10 రకాల కూరగాయలు..!

4

గన్‌పౌడర్ లేని రోజుల్లోనే బాణాసంచా కాల్చారా? మన పూర్వీకులు పాటించిన పద్ధతులివే!

5

Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rythu Bharosa Yasangi Update: రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం రైతుల సాగు ఖర్చులకుగాను అందిస్తోంది. కేవలం సాగు చేస్తోన్న భూములకు మాత్రమే ఈ సాయం అందేది. అయితే, కరువు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.   రైతు భరోసా నిధులు యాసంగిలో పంటలు సాగు చేయకపోయినా రైతులకు కూడా భరోసా నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్‌ సూత్ర ప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిధులు కూడా రెడీ చేయాలని అధికారులకు ఆదేశించారని తెలుస్తోంది. కాగా గత ఏడాది వానాకాలం సీజన్‌లో 70.40 లక్షల మందికి రైతు భరోసా నిధులు అందాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తారు. వానాకాలం ఖరీఫ్ పంట సాగు ప్రారంభ సమయంలో..అదేవిధంగా రబీ పంట సాగు ప్రారంభ సమయంలో కూడా విడుదల చేస్తారు.ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.6,000 చొప్పున అందిస్తారు. అంటే ఏడాదికి రెండు విడతల్లో మొత్తం రూ.12,000 వస్తాయి.

రైతు భరోసా పథకానికి అర్హతలు ఏమిటి?
తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి. సాగు  భూమి కలిగి ఉండాలి.
ప్రభుత్వ భూ రికార్డుల్లో నమోదై ఉండాలి.
భూమి, పట్టాదారు వివరాలు సరిగ్గా ఉండాలి.
ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా ఉండాలి.

గతంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సాగుకు అనువైన భూములకే పెట్టుబడి సాయం అందేదీ. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన అర్హులైన రైతులకు కూడా నిబంధనల ప్రకారం అవకాశం ఉంటుంది. అయితే, కరువు నేపథ్యంలో ప్రస్తుతం సాగు చేయని భూములకు కూడా ఈ సాయం అందనుంది.

కావాల్సిన డాక్యుమెంట్లు..
ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, భూమికి సంబంధించిన సర్వే నంబర్లు, విస్తీర్ణం వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్

Read Also: ఉచితంగా లైఫ్ ఇన్సూరెన్స్.. ఇంటింటా దరఖాస్తులు! నవంబర్ 19 నుంచి ప్రతి ఇంటికి రూ.5 లక్షల బీమా పథకం!
Read Also: బస్సు కదలాలంటే డోరు మూయాల్సిందే.. కండక్టర్ ప్రవళిక మృతితో TGSRTC కొత్త రూల్..

రైతు భరోసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా మీ గ్రామ వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.  పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు అందించాలి.
అంతేకాదు భూ భారతి రికార్డుల్లో భూమి వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయించుకోవాలి.
- బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి సరిచేయించుకోవాలి. తెలంగాణ రైతు భరోసా అధికారిక పోర్టల్ https://rythubharosa.telangana.gov.in/

రైతు భరోసా డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
సమస్య పరిష్కారం కోసం గ్రామ వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారి లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
Telugu News
Revanth Reddy
Telangana News