SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Srikalahasti Temple: శ్రీకాళ హస్తి ఆలయంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు.. అసలేం జరిగిందంటే..?

Fire Accident in srikalahasti: ప్రసాదాల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తులు, సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకిదిగి మంటలను అదుపుకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

Written By Inamdar Paresh
Published: Nov 12, 2026, 01:01 PM IST | Updated: Nov 12, 2026, 01:12 PM IST
Image Credit: fire accident in srikalahasti temple
Join

Fire Accident in srikalahasti temple premises: ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో కొలువైన ప్రసిద్ద పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదాల తయారీ కేంద్రంలో సిలిండర్ పేలడంతో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు,సిబ్బంది భయంతో బైటకు పరుగులు పెట్టారు. అప్పటికే మంటలు ఆలయం చుట్టుపక్కల వ్యాపించాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అందుబాటులో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలతో అధికారుల ప్రాథమిక ప్రయత్నాలు చేశారు. 

 

 

వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలంకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ఈ ఘటనలో ఆలయంలోకి భక్తుల ప్రవేశంపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై తెలియాల్సి ఉంది. మరోవైపు కార్తీక మాసం కావడంతో శ్రీకాళ హస్తిలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఈ ఘటనతో భక్తులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES