• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala devotees protest: తిరుమలలో భక్తుల ఆందోళన.. ఆ నిర్ణయంతో ఒక్కసారిగా నిరసనకు దిగిన భక్తులు..!

Tirumala devotees protest: తిరుమలలో భక్తుల ఆందోళన.. ఆ నిర్ణయంతో ఒక్కసారిగా నిరసనకు దిగిన భక్తులు..!

Tirumala devotees protest: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

Written ByVishnu Priya
Published: Sep 30, 2026, 03:21 PM IST|Updated: Sep 30, 2026, 03:26 PM IST
joinshare
Tirumala devotees protest: తిరుమలలో భక్తుల ఆందోళన.. ఆ నిర్ణయంతో ఒక్కసారిగా నిరసనకు దిగిన భక్తులు..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirumala devotees protest: భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని ఇప్పటికే ప్రకటించింది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో దర్శన ఏర్పాట్లను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

అయితే ఈ విషయం తెలియని కొందరు భక్తులు దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. రేపటి దర్శనం కోసం సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులకు అధికారులు ఆ లేఖలను స్వీకరించబోమని చెప్పారు. దీంతో కొందరు భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో 20 మందికి పైగా భక్తులు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయం ఎదుటకు చేరుకున్నారు. తమకు సిఫార్సు లేఖల ద్వారా శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. కొంతసేపు అక్కడ ఆందోళనకు దిగారు.

భక్తుల ఆందోళన నేపథ్యంలో అధికారులు వారికి నిబంధనలను వివరించారు. అక్టోబర్ 1 నుంచి 5 వరకు వీఐపీ సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ ముందుగానే ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

మరోవైపు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. వరుస సెలవులు, పెరటాసి మాసం కారణంగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఒకవైపు భారీ రద్దీ, మరోవైపు దర్శనానికి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో టీటీడీ వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిబంధన గురించి భక్తులకు అధికారులు వివరిస్తూ, సహకరించాలని కోరుతున్నారు. తిరుమలలో రద్దీని నియంత్రించేందుకు టీటీడీ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

Read More: Tirumala: భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుమల.. సర్వదర్శనానికి ఏకంగా 30 గంటలు.. అసలు కారణం ఏమిటంటే..?..

Read More: Kalki Bhawavan: శోకసంద్రంలో లక్షలాది భక్తులు.. ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్‌ నిర్యాణం
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
Tirupathi