• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విజయవాడ
  • /Vijayawada CI Death: విజయవాడలో తీవ్ర విషాదం..సచివాలయ ఉద్యోగుల ధర్నాలో పోలీస్ సీఐ మృతి..

Vijayawada CI Death: విజయవాడలో తీవ్ర విషాదం..సచివాలయ ఉద్యోగుల ధర్నాలో పోలీస్ సీఐ మృతి..

Vijayawada CI Heart Attack Death: విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న నున్న పోలీస్ స్టేషన్ సీఐ అహ్మద్ అలీ హఠాత్తుగా మృతిచెందారు. అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న ఆయన.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రాణాలు కాపాడాలని వైద్యులు ఎంతగానో ప్రయత్నించగా, ఫలితం లేకుండా పోయింది.

Written ByHarish Darla
Published: Sep 27, 2026, 04:38 PM IST|Updated: Sep 27, 2026, 04:41 PM IST
joinshare
Vijayawada CI Death: విజయవాడలో తీవ్ర విషాదం..సచివాలయ ఉద్యోగుల ధర్నాలో పోలీస్ సీఐ మృతి..
Image Credit: Source: AI Generated Image

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijayawada CI Heart Attack Death: విజయవాడ నగరంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక నున్న పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా పనిచేస్తున్న అహ్మద్ అలీ డ్యూటీలో ఉండగా ప్రాణాలు విడిచారు. విధి నిర్వహణలో ఉన్న టైమ్‌లో ఒక్కసారిగా గుండెపోటుకు గురైనట్లు ఆయన సహచరులు వెల్లడించారు. కొంతసేపటికే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

ఆదివారం నాడు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో విజయవాడ నగరవ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా పోలీసులతో బందోబస్త్ భారీగా నిర్వహించారు. అయితే ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా నున్న సీఐ అహ్మద్ అలీ తన సిబ్బందితో కలిసి గాంధీ నగర్‌లోని ధర్నా చౌక్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ ఆందోళన పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఎంతో చురుగ్గా విధులు నిర్వర్తిస్తూ, క్షణంలో హఠాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పితో వెంటనే అక్కడికక్కడ కూలిపోయారు.

ఆసుపత్రికి తరలింపు..
నున్న సీఐ అహ్మద్ అలీ హఠాత్తుగా కింద పడి కుప్పకూలిపోవడంతో తన పక్కనే ఉన్న సహచర పోలీసు సిబ్బంది, హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రి అత్యవసరం విభాగానికి తరలించగా.. అప్పటికే అక్కడున్న వైద్య సిబ్బంది సీఐకి కావాల్సిన తక్షణ అత్యవసర చికిత్సను అందించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 

అయితే అప్పటికే సీఐ ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల వైద్యులు తమ ప్రయత్నాలేని ఫలించలేదని చేతులు ఎత్తేశారు. అయితే అప్పటికే సీఐ ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు ఎంతో కృషి చేసినా చికిత్స తీసుకుంటూనే అతను మృతి చెందారు.

పోలీసు వర్గాల్లో తీవ్ర విషాదం..
శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ముందుంటూ, నిత్యం విధులకు అంకితభావంతో పనిచేసే సమర్థుడైన పోలీసు అధికారి విధి నిర్వహణలోనే హఠాత్తుగా మరణించడం విజయవాడ పోలీసు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. అయితే నున్న సీఐ అహ్మద్ అలీ మరణవార్త వినగానే ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో కలిసి పనిచేసిన సహచర పోలీసు అధికారులు, సిబ్బంది ఈ ఘటనతో మనోవేదనకు గురయ్యారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Vijayawada
Crime News