• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /విశాఖపట్నం
  • /గ్రామీణ నేపథ్యంలో హృధ్యంగా సాగే ‘అనకాపల్లి’..

గ్రామీణ నేపథ్యంలో హృధ్యంగా సాగే ‘అనకాపల్లి’..

Anakapalli Review: తెలుగులో హైదరాబాద్, విశాఖ, తిరుపతి,సింహా చలం, భద్రాచలం ఊర్లు,నగరాల పేరుతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ఈ కోవలో తెలుగులో ‘అనకాపల్లి’ పేరుతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనకాపల్లి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ రోజు అనకాపల్లిలో కాకుండా మిగిలిన ఏరియాల్లో ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 02, 2026, 07:53 PM IST|Updated: Oct 02, 2026, 10:04 PM IST
joinshare
గ్రామీణ నేపథ్యంలో హృధ్యంగా సాగే ‘అనకాపల్లి’..
Image Credit: Anakapalli Review (x/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Auto Charges Hike: ఆటో ఛార్జీల పెంపుపై కార్మికుల ఆగ్రహం.. 3 రోజుల నిరసనలు

Auto Charges Hike: ఆటో ఛార్జీల పెంపుపై కార్మికుల ఆగ్రహం.. 3 రోజుల నిరసనలు

2

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?

3

Vande Bharat Sleeper: ఏపీకి భారీ శుభవార్త.. రెండు ప్రధాన నగరాల మధ్య వందే భారత్‌ స్లీపర్‌ రైలు

4

Sitara Ghattamaneni: సితార మాటల్లో పక్కా తెలంగాణ స్లాంగ్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కొత్త ట్రీట్!

5

Fahadh Faasil: నేను వేసుకున్న బంగారం మొత్తం నా భార్యవే.. ఫహాద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘అనకాపల్లి’. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన ఈ మూవీతో  ఖగేష్ దర్శకుడిగా వెండితెర పరిచయం అయ్యాడు. అక్టోబర్ 2 సందర్భంగా విడుదలైన ఈ సినిమా తెలుగు ఆడియన్స్  మదిని దోచుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.  

కథ విషయానికొస్తే.. 
అనకాపల్లిలో బుల్లెట్ (తారక్ పొన్నప్ప) రౌడీ. అతనంటే అందరికి భయం. అదే ఊర్లో బుల్లెట్ నాయుడు (కాండ్రేగుల నాయుడు) అనే డ్రగ్ డీలర్‌లో అతనికి చిన్న పాటి గొడవులుంటాయి. అదే ఊర్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా సాంబశివరావు (నక్కిన త్రినాథ రావు) ఉద్యోగం చేస్తుంటాడు. అతని కుమారుడు   సూర్య (విక్రమ్ సహిదేవ్). ఇక తండ్రి నీతి నిజాయితీల వల్ల తాము చితికి పోయామనే బాధ పడుతుంటాడు. అదే ఊర్లో బుల్లెట్ గ్యాంగ్‌లో చేరి అతని కుడిభుజం అవుతాడు.  

మరోవైపు సూర్య.. అమృత (సంధ్య విశిష్ఠ)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ఇంటికి ఉన్న కరెంట్ మీటర్ ప్రాబ్లెమ్ ‌ను తన తండ్రి సాయంతో సాల్వ్ చేయాలనే ప్రయత్నం చేస్తుంటాడు. అదే క్రమంలో అమృతను బుల్లెట్‌తో సన్నిహితంగా ఉండటం చూసి సహించలేకపోతాడు. ఈ క్రమంలో సూర్య ఏం చేశాడు..? తాను ఎంతో ఇష్టంగా ప్రేమించిన యువతి.. వేరే వాడిని ఇష్టపడటం సహించని సూర్య చివరకు ఏం చేశాడు. ఈ క్రమంలో హీరో తల్లి జయంతి (ఇంద్రజ), ఎమ్మెల్యే (శ్రీనివాస్ వడ్లమాని) ఏమి చేశారు..? చివరకు ఏం జరిగిందనేదే అనకాపల్లి  సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

‘అనకాపల్లి’ కథ విషయానికొస్తే.. హీరో.. తొలి చూపులోనే హీరోయిన్‌ను ప్రేమించడం. కథానాయికకు సంబంధించిన సమస్యను తన సమస్యగా భావివంచి తీర్చే ప్రయత్నం చేయడం.. కానీ ఆమె వేరెకరితో చనువుగా ఉండటం సహించలేని మనస్తత్త్వం  ఉన్న కథానాయకుడు.. ఈ క్రమంలో ఏం చేశాడు. మరోవైపు తన తండ్రి మంచి ఉద్యోగం చేస్తోన్న మధ్య తరగతి లైఫ్‌ను లీడ్ చేయడం వంటివి హీరోకు సహించవు. దీంతో రౌడీ గ్యాంగ్‌లో చేరడం.. ముఖ్యంగా తల్లిదండ్రులు మంచిగా జీవిస్తున్నా.. పిల్లలు మాత్రం వారిని అర్ధం చేసుకోకుండా అనవసరపు హంగులకు పోవడం.. దాంతో పేరెంట్స్ ఇబ్బందుల పాలు కావడం వంటివి ఈ సినిమాలో చూపించావు. ముఖ్యంగా ప్రేమకు, ఆకర్షణకు ఉన్న తేడా ఏమిటి..? త్రినాథ రావు కథకు ఖగేష్ మంచి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆత్మబలం.. తరహా ఛాయలు ఇందులో కనిపిస్తాయి. ముఖ్యంగా తను ప్రేమించిన యువతి వేరకొడితో చనువుగా ఉండడాన్ని సహించకపోవడం..వంటివి సీన్స్ బలంగా రాసుకున్నాడు.

మొదటి అర్ధభాగంలో బుల్లెట్ గ్యాంగ్‌లో చేరడం.. ఆ తర్వాత హీరోయిన్‌ను ప్రేమించడం.. కానీ ఆమె వేరేకరిని లవ్ చేయడం వంటి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ జర్నీగా, రివేంజ్ డ్రామాగా సాగిపోతూనే ఉంటుంది.  ఇక క్లైమాక్స్ అయిపోయింది.. అని అనుకున్న టైంలో మళ్లీ ఓ బ్లాక్‌తో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ యాడ్ చేశారు. అలా చివరకు అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేసి ముగించాడు. ప్రేమకు నిర్వచనం చెప్పేలా కథను ముగించడం విశేషం.

ఈ సినిమా మనల్ని కూడా అనకాపల్లిలోకి తీసుకెళ్లింది. గ్రామీణ వాతావరణం, అక్కడ రాజకీయాలు అన్ని బాగా సెట్ అయ్యాయి.  మాటలు, పాటలు, కెమెరా వర్క్ ఇలా అన్నీ బాగున్నాయి.  క్యాస్టూమ్స్ కూడా ఆ కాలానికి తీసుకెళ్లింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే..

విక్రమ్ సహిదేవ్ హీరోగా సూర్య పాత్రలో నవరసాలు పండించే ప్రయత్నం చేశాడు. ఒకటి రెండు తప్పించి మిగిలిన ఎమోషన్స్ పండించిన విధానం బాగుంది. ఎమోషన్స్, యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఇలా అన్ని యాంగిల్స్‌లోనూ విక్రమ్ మెప్పించాడు. ఇక తారక్ పొన్నప్ప అయితే తన నటనతో అందరినీ భయపెట్టే నటన ప్రదర్శించాడు. సంధ్య వశిష్టను తెరపై చూస్తే నిజంగానే అనకాపల్లి అమ్మాయిలానే నాచురల్‌గా యాక్ట్ చేసింది.  ఫస్ట్ హాఫ్‌లో డ్రగ్స్ డాన్‌గా నాయుడు పాత్రలో నిర్మాత కాండ్రేగుల నాయుడు చక్కగా ఒదిగిపోయాడు. తండ్రిగా త్రినాథరావు, తల్లిగా ఇంద్రజ మిడిల్ క్లాస్ తల్లిదండ్రల పాత్రలకు  ప్రతినిధుల్లా నటించారు. రౌడీ గ్యాంగ్, ఎమ్మెల్యే, ఎస్సై, డీఎస్పీ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్: అనకాపల్లి.. ఎమోషనల్‌గా సాగే ‘రా

 అండ్ రస్టిక్ లవ్ స్టోరీ

రేటింగ్: 3 /5

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie
Visakhaptnam
Tollywood