DA Hike Announcement: పండుగల వేళ డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పే కమిషన్‌పై కసరత్తు జరుగుతుండగా.. జులై 2026 విడతకు సంబంధించిన డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల వరుసగా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాల్లో కూడా డీఏ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 16న పనితీరుతో సంబంధం లేని బోనస్‌ను ప్రకటించినా.. డీఏపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నెల 28న మరోసారి కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరగనుండడంతో డీఏపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
సాధారణంగా ప్రతి వారం జరిగే కేబినెట్ భేటీల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను వెల్లడిస్తుంది. డీఏ, డీఆర్ పెంపు ప్రభావం కోటికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రత్యక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఎక్కువగా కేబినెట్ భేటీ తర్వాతే ఈ ప్రకటన చేస్తుంటుంది. అందుకే అక్టోబర్ 28న జరిగే సమావేశంలో డీఏ పెంపుపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే డియర్‌నెస్ అలవెన్స్ పెంపును కేబినెట్ భేటీలోనే ప్రకటించాలనే తప్పనిసరి నిబంధనేమీ లేదు. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ కేబినెట్ సమావేశంతో సంబంధం లేకుండా నేరుగా కూడా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ప్రకారం.. ఈసారి డీఏ 3 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు డీఏ 60 శాతంగా ఉండగా.. 3 శాతం పెంచితే అది 63 శాతానికి చేరుకోనుంది. ప్రభుత్వం డీఏ పెంపును ఎప్పుడు అధికారికంగా ప్రకటించినా.. జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. జులై నుంచి ఏరియర్స్‌తో కలిపి ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో ఒకేసారి జమ అవుతాయి.
మరోవైపు కొత్త పే కమిషన్ అమలుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం కమిషన్ సిఫార్సులు రూపొందించే పనిలో ఉంది. కొత్త పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఎంత నిర్ణయిస్తుందనే విషయంపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ డిసైడ్ అయితే.. ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్‌పై క్లారిటీ రానుంది. సిఫార్సులు ప్రభుత్వానికి సమర్పించిన తరువాత మార్పులు చేర్పులతో అమలు చేయనుంది.