SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 75శాతం మార్కులు సాధించాల్సిందే.. ఆ సర్వీసులకు మాత్రం ఉచితం..!!

Driving License: దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా భారతీయ పౌరులతో పాటు విదేశీయులను ఎంతో సులభంగా గుర్తించేందుకు వీలుగా, వారికి విభిన్న రంగుల్లో డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని ప్రతిపాదించింది.

Written By Bhoomi
Published: Oct 23, 2026, 11:10 AM IST | Updated: Oct 23, 2026, 11:11 AM IST
Image Credit: Driving License
Join


Driving License: దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.  ఇందులో భాగంగా భారతీయ పౌరులతో పాటు విదేశీయులను ఎంతో సులభంగా గుర్తించేందుకు వీలుగా, వారికి విభిన్న రంగుల్లో డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని ప్రతిపాదించింది. ఈ మేర‌కు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహనాల నిబంధనలలో సవరణలు చేస్తూ అధికారికంగా ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతిపాదిత ఈ నూతన వ్యవస్థ అమలులోకి వస్తే, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుపై సదరు వాహనదారుడి జాతీయత (Nationality) కూడా స్పష్టంగా ముద్రిస్తుంది.

నకిలీ పత్రాల వాడకాన్ని నివారించడం.. లైసెన్సింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం ఈ సంస్కరణల ప్రాథమిక లక్ష్యమని తెలిపింది. వయస్సు, చిరునామా ధృవీకరణ కోసం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లేదా నోటరీ ముందు సమర్పించిన అఫిడవిట్లు, జీవిత బీమా పాలసీలను ఇకపై అంగీకరించబోమని ఈ ముసాయిదా స్పష్టం చేసింది. వీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆన్‌లైన్ సురక్షిత డ్రైవింగ్ ట్యుటోరియల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత మార్కును 60శాతం నుండి 75శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి లైసెన్స్‌పై డ్రైవర్ బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్, అత్యవసర సంప్రదింపు వివరాలు ముద్రించి ఉంటాయి. ఆన్‌లైన్ ఆధార్ ధృవీకరణ ద్వారా తమ చిరునామా, పేరు లేదా ఇతర వివరాలను మార్చుకునే వారికి సంబంధిత రుసుముల నుండి మినహాయింపు ఉంటుంది.

చిరునామా, వయస్సు, గుర్తింపు ధృవీకరణకు ఏ పత్రాలు చెల్లుబాటు అవుతాయో కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. చిరునామా రుజువుగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇ-రేషన్ కార్డు, ఇటీవలి విద్యుత్ లేదా గ్యాస్ బిల్లులను సమర్పించవచ్చు. లైసెన్స్ మార్పుల దరఖాస్తులకు గడువు 15 రోజులు, చిరునామా మార్పుల దరఖాస్తులకు 30 రోజులు. 30 రోజుల తర్వాత కూడా చిరునామా మార్పు దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే, అది ఆటోమెటిగ్గా ఆమోదిస్తుంది.

ప్రస్తుతం.. ఈ ప్రతిపాదనలన్నీ ముసాయిదా దశలో ఉన్నాయి. నోటిఫికేషన్ వెలువడిన 30 రోజుల్లోగా ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత తుది నియమాలను ఖరారు చేస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Also Read: 

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధరలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES