SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..!!

Gold Rate: బంగారం కొనాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు నేడు భారీగా దిగివచ్చాయి.

Written By Bhoomi
Published: Nov 12, 2026, 12:58 PM IST | Updated: Nov 12, 2026, 12:59 PM IST
Image Credit: Gold Rate Today
Join


Gold Rate: బంగారం కొనాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు నేడు భారీగా దిగివచ్చాయి. బుధవారం ధరలతో పోల్చితే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడిపై రూ. 2,180 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి పై 2000 మేర తగ్గింది. ఈ భారీ తగ్గుదలతో కొనుగోలుదారులు భారీ ఊరట లభించిందని చెప్పాలి.

తాజా ధరల వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్.. విజయవాడలో గురువారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,800గా నమోదైంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,150గా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,850గా ఉంది. విశాఖపట్నం, వరంగల్, తిరుపతి, కాకినాడ, నిజామాబాద్ వంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి ధరలే నెలకొని ఉన్నాయి.

జాతీయ రాజధాని అయిన ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,950గా నమోదైంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అందువల్ల, కొనుగోలు చేసే ముందు మీ స్థానిక నగల దుకాణంలో తాజా ధరలను నిర్ధారించుకోవడం ఉత్తమం.

Also Read: 

 

 


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES