SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గోల్డ్ కొనాలనుకునేవారికి గోల్డెన్ ఛాన్స్.. బంగారం రూ. 5,000 ..వెండి రూ. 12,000 డౌన్.. నేటి ధరలు ఇలా..!!

Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ప్రాఫిట్ బుకింగ్ దాటికి విలువైన లోహాలు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి వైపు దూసుకెళ్లి బంగారం, వెండి ధరలు నిన్న ఒక్కరోజే భారీగా పతనం అయ్యాయి.

Written By Bhoomi
Published: Oct 31, 2026, 09:24 AM IST | Updated: Oct 31, 2026, 09:26 AM IST
Image Credit: Gold Rate
Join

Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ప్రాఫిట్ బుకింగ్ దాటికి విలువైన లోహాలు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి వైపు దూసుకెళ్లి బంగారం, వెండి ధరలు నిన్న ఒక్కరోజే భారీగా పతనం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అమ్మకాలకు ఆసక్తి చూపిస్తుండటంతో దేశీయంగా, అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తీరు మారింది.

అంతర్జాతీయ మార్కెట్లో 24క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 137 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో 3882 డాలర్లకు  చేరుకుంది. 1 ఔన్సు వెండి ధర 3.23 డాలర్లు తగ్గింది. దీంతో 49 డాలర్లకు చేరింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 5000 మేర తగ్గింది. తులం బంగారం ధర ప్రస్తుతం 1,41,800 పలుకుతుంది. కిలో వెండి ధర రూ. 12,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధరరూ. 1,83,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

కాగా ఈ ఏడాది జనవరి 29వ తేదీన అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర  5626 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. కిలో వెండి ధర 121 డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో దేశీయంగా పది గ్రాముల బంగారం ధర రూ. 1,86,000కు  చేరింది. కిలో వెండి ధర రూ. 4,20,000 కు చేరుకుంది.

మరోవైపు గ్లోబల్ మార్కెట్లో వెండి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అంతర్జాతీయంగా వెండి ఏకంగా 6శాతం మేర క్షీణించింది. కీలకమైన 50 డాలర్ల దిగువకు పడిపోయింది. 11 నెలల కనిష్టమైన 49.06 డాలర్లకు పడిపోవడం బులియన్ మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. చివరిసారిగా 2025 నవంబర్ 21వ తేదీన వెండి 50 డాలర్ల మార్కు వద్ద ట్రేడ్ అయ్యింది.

అయితే అమెరికా డాలర్ బలపడటం.. బాండ్ ఈల్డ్స్ పెరగడం, గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎలాంటి రిస్క్ లేకుండా ఉండే ఇతర రంగాల వైపు మళ్లించడం వల్ల ఈ రికార్డు స్థాయి అమ్మకాలకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్లో ఒడుదొడుకులు ఇలానే కొనసాగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Also Read: 

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ లో ఏకంగా 16రోజులు బ్యాంకులు బంద్..!!

52 వేల మంది ఎస్జీటీల ఆవేదన.. పేద పిల్లల భవిష్యత్తు కోసం.. జీవో 25 సవరించండంటూ సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES