Gold Rate Today: దేశీయ బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులకు ఊరట లభిస్తోందని చెప్పాలి. సోమవారం నవంబర్ 16వ తేదీన కూడా బంగారం వెండి ధరలు తగ్గాయి. వివాహాలు, శుభకార్యాల కోసం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్నవారికి ఈ పరిణామం ఎంతో సానుకూలంగా మారిందని చెప్పాలి.
కాగా నేడు నవంబర్ 16వ తేదీ ధరలు చూసినట్లయితే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.820 తగ్గి రూ.1,36,800కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 తగ్గి రూ.1,25,400 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.1,90,000 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ ధరలపై 3శాతం జీఎస్టీ అదనంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి.
ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $3,898.84 కు చేరుకున్నాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి $3,903 కు చేరాయి. యూఎస్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) సెప్టెంబర్‌లో 1.4 శాతం పెరిగి, అక్టోబర్‌లో 0.3 శాతానికి తగ్గింది. ఇది ఆర్థికవేత్తల అంచనా అయిన 0.4 శాతం కంటే తక్కువకు పడిపోయింది.
ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనుండటంతో, వడ్డీ రేట్ల భారీ పెంపు భయం తగ్గింది. ఇది బంగారం ధరలను స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. అయితే, గత వారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 3 శాతం తగ్గాయి. ఏడాదికి పైగా కాలంలో బంగారం ధరలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం, బంగారం పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది.
గత వారం ఇప్పటివరకు బంగారం ధరలు 4 శాతానికి పైగా తగ్గాయి. జూన్ మొదటి వారం తర్వాత బంగారానికి ఇదే అత్యంత ప్రతికూల వారం. పెరుగుతున్న చమురు ధరల కారణంగా మరింత ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారంపై ఒత్తిడిని పెంచాయి. డిసెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచేందుకు 89.4 శాతం అవకాశం ఉందని మార్కెట్ అంచనాలు సూచిస్తున్నాయి.
వడ్డీ రేట్లు పెరిగితే, ఎలాంటి రాబడిని ఇవ్వని బంగారంలో పెట్టుబడి పెట్టడం ఆకర్షణ కోల్పోతుంది. వెండి ధరలు 0.2 శాతం తగ్గి ఔన్సుకు $49.91కి, ప్లాటినం ధరలు 0.4 శాతం తగ్గి $1,512.03కి పడిపోయాయి. మరోవైపు, బంగారం ధరల తగ్గుదల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ప్రయోజనకరంగా ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వివాహం చేసుకోబోయే వారికి, బంగారు ఆభరణాలు కొనడానికి తక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో, బంగారం ధరలు తగ్గడం సర్వసాధారణమైపోయింది.
Also Read: