SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కేవలం రూ. 10 కే యామీ గౌతమ్ గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్.. ఇంట్లోనే ఈ ఒక్క హోమ్ రెమెడీ ట్రై చేయండి!

బాలీవుడ్ ప్రముఖ నటి యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనతో అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఆమె 'హక్‌' తో పాటు 'ధురంధర్' వంటి సినిమాల్లో కూడా నటించారు. అయితే ఆమె తన చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసా? కేవలం రూ.10 తో మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Written By Renuka Godugu
Published: Oct 14, 2026, 06:01 PM IST | Updated: Oct 14, 2026, 06:04 PM IST
Image Credit: Skin Care Routine:
Join

Skin Care Routine: అందంగా కనిపించడం కోసం చాలామంది పార్లర్‌లకు వెళ్లి భారీగా ఖర్చు చేస్తూ ట్రీట్‌మెంట్ తీసుకుంటారు. అయితే కొంతమందికి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవచ్చు లేదా ఫలితాలు తక్కువగా ఉండవచ్చు. దీనికి బదులుగా, ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే కేవలం రూ.10 తో మీ ముఖాన్ని మెరిపించవచ్చు. ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ అనుసరించే స్కిన్ కేర్ రొటీన్ గురించి మీకు తెలుసా? ఇంట్లోని వస్తువులతోనే దీనిని తయారు చేసుకోవచ్చు. 'హక్‌',  'ధురంధర్' వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించిన యామి గౌతమ్, స్కిన్ కేర్ కోసం పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆమె స్కూల్ చదువుతున్నప్పటి నుండి ఈ సాంప్రదాయ పద్ధతినే అనుసరిస్తున్నారు. పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ప్రతి వంటగదిలో లభించే వస్తువు. ఒక టీవీ పత్రికతో ఆమె మాట్లాడుతూ, స్కూల్ రోజుల్లోనే తన తల్లి పసుపును స్కిన్ కేర్ కోసం ఉపయోగించేదని చెప్పారు. మన సంప్రదాయంలో ఏ శుభకార్యానికైనా పసుపు చాలా కీలకం, అలాగే చర్మ సౌందర్యానికి కూడా పసుపు అద్భుతంగా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.

యామీ గౌతమ్ చర్మం చాలా సున్నితం అని చెప్పుకొచ్చారు. అందుకే ఆమె పసుపుతో పాటు కొద్దిగా ముల్తానీ మట్టిని కలిపి వాడుతుంటారు. ఈ రెండు కలిసినప్పుడు ముఖంపై ఒక మ్యాజికల్ ప్రభావాన్ని చూపుతాయని, ముల్తానీ మట్టి ముఖానికి మంచి కాంతిని అందిస్తుందని ఆమె అంటున్నారు.

పసుపు.. ముల్తానీ మట్టి ప్యాక్ తయారీ విధానం..
ఈ పేస్ట్‌ను తయారు చేయడానికి కొద్దిగా ముల్తానీ మట్టిని తీసుకోవాలి. దీనికి అర చెంచా పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ లేదా నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, గొంతు భాగంలో అప్లై చేయాలి. ఇది పది నిమిషాల తర్వాత ఆరిపోతుంది, ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మన పూర్వీకుల కాలం నుండి సౌందర్య ఉత్పత్తుల్లో పసుపును వాడుతున్నారు, ఎందుకంటే ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని కాపాడతాయి. అయితే, ముఖానికి ఏదైనా కొత్తగా ప్రయోగించే ముందు తప్పనిసరిగా 'ప్యాచ్ టెస్ట్' చేసుకోండి. అవసరమైతే నిపుణుల సలహా మేరకు ఫేస్ ప్యాక్స్‌ను ఉపయోగించడం మంచిది.(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు, సూచనలు కేవలం పాఠకుల అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే అందించాం. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కానేరదు. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా కొత్త జీవనశైలి మార్పులు పాటించాలన్నా ముందుగా సంబంధిత వైద్యులను సంప్రదించండి).

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES