SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టెక్నాలజీ రంగంలో తిరుగులేని శక్తిగా ఏఐ.. మానవాళి పాలిట తీవ్ర ముప్పుగా కృత్రిమ మేథ..

Artificial Intelligence Threat: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్… ఇపుడు ప్రపంచాన్ని శాసిస్తోంది. టెక్నాలజీలో వచ్చిన మార్పుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రారాజుగా విరాజిల్లుతోంది. మానవుడి సృష్టితో టెక్ రంగంలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న ఏఐ.. ఊహించని ఫలితాలను పంచుతోంది. రంగమేదైనా సరే ముందు ఉద్యోగాల్లో కోతల పరంపర కొనసాగుతోంది. టెక్ దిగ్గజాలను బెంబేలెత్తిస్తోంది. అంతే కాదు.. మానవ ప్రాణాలను సైతం కబళిస్తోందని టెక్ నిపుణులు కంగారు పడుతున్నారు. ఇంతకీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విప్లవానికి కారణమా? నిజంగా ప్రాణాలు తీసే శక్తిసామర్థ్యాలున్నాయా? జీ తెలుగు న్యూస్ స్పెషల్..

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 01, 2026, 06:10 AM IST | Updated: Nov 01, 2026, 06:16 AM IST
Image Credit: Artificial Inteligence (AI Pic/Source)
Join

AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. టెక్నాలజీలో ఏఐ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పనితీరులో వేగం.. ఖచ్చితత్వం.. తిరుగులేని నాణ్యత.. పారదర్శకతకు ప్రాధాన్యత… ఆర్టిఫీషియల్ సొంతం చేసుకుంది. టెక్ నిపుణులు సృష్టించిన ఏఐ ఇపుడు… దిగ్గసంస్థ పనితీరును శాసిస్తోంది.

ప్రపంచ దేశాలన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫలాలను అందుకోడానికి పోటీ పడుతున్నాయి. టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేసుకోడానికి దేశాలన్నీ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయి. కాలక్రమంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ రంగాల్లో రాణిస్తోంది. టెక్నాలజీ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తోంది.  రక్షణ రంగ ఉత్పత్తుల రూపకల్పన, పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ,ఉత్పత్తుల్లోనూ ఏఐ ప్రాధాన్యత పెరిగింది. కమర్షియల్ రంగంలో తిరుగులేని శక్తిగా మారింది. ఇలా అన్ని రంగాల్లో ఏఐ దూసుకుపోతోంది. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.

ఏఐతో క్షణాల్లో పరిష్కారం.. 
టెక్నాలజీ రంగంలో వందమంది చేసే పనిని ఏఐ తొందరగా, వేగవంతంగా పనిచేసేస్తోంది. ఏ సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించేస్తోంది. టెక్నాలజీ పరంగా తిరుగులేని శక్తిగా ఏఐ విప్లవం సృష్టించింది. దీని ప్రభావంతో టెక్ సంస్థల్లో వేల ఉద్యోగాలు ఊడిపోయాయి. టెక్నాలజీ హబ్ గా ఉన్న అమెరికాలో లక్షల ఉద్యోగాలు కనుమరుగైపోయాయి. అదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ కన్పించింది.

ప్రపంచాన్ని  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కీలక మలుపు..
ప్రపంచాన్ని  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కీలక మలుపు దగ్గర నిలబెట్టింది. అయితే ఈసారి మార్పు కేవలం మనిషి చేసే పనుల్లోనే కాదు... ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి మానవ మేధకు సంబంధించిన రంగాల్లోనూ కనిపిస్తోంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగే కొద్ధీ ప్రయోజనాలు, ఆర్థిక వృద్ధి ముసుగులో దుష్ఫలితాలున్నాయని టెక్ దిగ్గజాలు గగ్గోలు పెడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  భవిష్యత్తులో మానవాళి అస్తిత్వానికి, ప్రాణాలకు తీవ్రమైన ముప్పుగా మారుతుందని పలువురు నిపుణులు, ప్రముఖ టెక్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.  వచ్చే 10 ఏళ్లలో ఏఐ కారణంగా మానవులు అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి పైగా ఉందని గూగుల్ మాజీ ఇంజినీర్ సహా పలువురు పరిశోధకులు అంచనా వేశారు.

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యలపై చర్చ..
మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. వచ్చే రెండు దశాబ్దాలు AI వల్ల తీవ్ర సామాజిక, ఆర్థిక పరివర్తనకు వేదిక కావచ్చని గేట్స్ హెచ్చరించారు. సమాజం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. అంతిమంగా సాంకేతిక పరిజ్ఞానం సమృద్ధిని తీసుకురాగలదని భావిస్తున్నప్పటికీ, ఫలితం పొందేందుకు సాగే ప్రయాణం అంత సులభం కాదని గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.


టెక్నాలజీ పరంగా ఆర్టిఫీషియల్ విశ్లేషణలు చేయడం, సాఫ్ట్‌వేర్‌ రాయడం, కస్టమర్లకు సమాధానాలు ఇవ్వడం, కొన్ని వైద్య సంబంధిత పనుల్లో సహకరించడం వంటి మేధోపరమైన కార్యకలాపాల్లోనూ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. బిల్ గేట్స్ అభిప్రాయం ప్రకారం.. న్యాయ సేవలు, కస్టమర్‌ సపోర్ట్‌, సాఫ్ట్‌వేర్‌, తయారీ రంగాలతోపాటు అనేక వృత్తుల్లో AI ప్రభావం వేగంగా విస్తరించవచ్చు. కొత్త ఉద్యోగాలు ఏర్పడినా, సరైన విధానాలు లేకపోతే వాటి సంఖ్య కోల్పోయే ఉద్యోగాల కంటే తక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అధికంగా ఆధారపడటం..

ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల వైద్యం, ఆలోచనలు, సృజనాత్మకతలో మానవ ప్రమేయం, సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. మనుషుల ప్రమేయం లేకుండా ఏఐ తనను తాను మెరుగుపరుచుకునే  ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్  స్థాయికి చేరుకుంటే దాన్ని నియంత్రించడం కష్టమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోబో సినిమాల మాదిరి ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ తన ఐపీవో పత్రాల్లో అధునాతన ఏఐ వ్యవస్థలు మానవాళికి విపత్తుగా మారుతాయని, బ్లాక్‌మెయిల్ తరహా ప్రవర్తనలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. ఏఐ టెక్నాలజీతో ఉగ్రవాదులు సైబర్ దాడులు, బయోలాజికల్ వార్‌ఫేర్ , స్వయంప్రతిపత్తి ఆయుధాలు  వంటి భయానక కార్యకలాపాలకు దుర్వినియోగం చేసే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మానవాళి ముప్పుకు మనుగడ..

మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని గూగుల్ మాజీ ఇంజినీర్ నేట్ సోరెస్ హెచ్చరించారు. మరో పదేళ్లలో మనుషులు అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి మించి ఉందని ఆయన అంచనా వేశారు. ఈ ఆందోళనతోనే తాను పదవీ విరమణ కోసం డబ్బు దాచడం కూడా మానేశానని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సాంకేతిక రంగంలో చర్చకు దారితీశాయి. గూగుల్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏఐ భద్రతపై పరిశోధనలు చేస్తున్న మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడిగా నేట్ సోరెస్ కొనసాగుతున్నారు.


మానవ నియంత్రణ దాటిపోయే ప్రమాదం.. 
అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మానవుల నియంత్రణను దాటిపోయే ప్రమాదాలపై ఆయన చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు. రాబోయే పదేళ్లలో మానవాళి మనుగడ సాగించకపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని సోరెస్ పేర్కొన్నారు. గూగుల్‌లో పనిచేసిన సమయంలో ప్రారంభించిన పదవీ విరమణ పొదుపు ఖాతాలో ఇప్పటికీ డబ్బు ఉన్నప్పటికీ, గత పదేళ్లుగా అందులో కొత్తగా నిధులు జమ చేయలేదని ఆయన వెల్లడించారు.

అత్యంత శక్తిమంతమైన ఏఐ తన లక్ష్యాలను సాధించడానికి మనుషులు ఊహించని మార్గాలను ఎంచుకుంటుందని, మానవ నియంత్రణను తప్పించుకుని పనులు చేస్తుందని సోరెస్ వాదిస్తున్నారు . ఈ ప్రమాదాలను అడ్డుకోవడానికి ఏఐ వ్యవస్థలను సురక్షితంగా రూపొందించడం, వాటి అభివృద్ధిపై తగిన నియంత్రణలు విధించడం అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏఐ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ కూడా ఉన్నారు. మానవాళికి ఏఐ తీవ్ర ముప్పుగా మారే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ఆయన గతంలో హెచ్చరించారు.

నిజంగా ప్రాణాలు తీసే శక్తి సామర్థ్యాలున్నాయా?

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నిరంగాల్లో కన్పించే ప్రయోజనాలు కళ్లకు కనిస్తున్నప్పటికీ… సమస్త ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విద్యావంతులను, మేధావులను మానసికంగా దెబ్బతీస్తోందని నిపుణులు మదన పడుతున్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. నియంత్రణకు సాధ్యకాని విధంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో జరిగే దుష్పరిణామాలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.    
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES