• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Anitha Chowdary: విమాన టికెట్ల బుకింగ్ పేరుతో సినీ నటి అనితకు సైబర్ మోసం.. రూ.4.14 లక్షలు మాయం!

Anitha Chowdary: విమాన టికెట్ల బుకింగ్ పేరుతో సినీ నటి అనితకు సైబర్ మోసం.. రూ.4.14 లక్షలు మాయం!

Anitha Chowdary: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలడం లేదు. తాజాగా సినీ నటి గోగినేని అనిత సైబర్ మోసానికి గురయ్యారు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేస్తామని నమ్మించిన కేటుగాళ్లు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Written ByVishnu Priya
Published: Nov 18, 2026, 11:27 IST|Updated: Nov 18, 2026, 11:31 IST
joinshare
Anitha Chowdary: విమాన టికెట్ల బుకింగ్ పేరుతో సినీ నటి అనితకు సైబర్ మోసం.. రూ.4.14 లక్షలు మాయం!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Anitha Chowdary: వివరాల్లోకి వెళ్తే.. సినీ నటి గోగినేని అనిత హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందుకోసం విమాన టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం వెతుకుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు.

'లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్' సంస్థకు చెందిన వారమంటూ రాజేష్ అనే వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ.4,14,180 అవుతుందని చెప్పాడు. టికెట్ బుకింగ్ ప్రక్రియ కోసం తన డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన అనిత కార్డు వివరాలను అందించారు. అంతేకాకుండా టికెట్ బుకింగ్ కోసమేనని భావించి తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పేశారు.

ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.4,14,180 డబ్బులు కట్ అయ్యాయి. అయితే డబ్బులు చెల్లించినప్పటికీ విమాన టికెట్ బుకింగ్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు ఆమెకు అందలేదు. ఖాతా నుంచి డబ్బులు వెళ్లిపోవడం, టికెట్లు రాకపోవడంతో తాను మోసపోయినట్లు అనిత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలియని వ్యక్తులకు బ్యాంక్ కార్డు వివరాలు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని పోలీసులు సూచిస్తున్నారు. విమాన టికెట్లు లేదా ఇతర ఆన్‌లైన్ బుకింగ్‌లు చేసేటప్పుడు అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.
 

Read More: నార్త్ అమెరికాలో రామాయణం దెబ్బకు బాహుబలి రికార్డులు ఫసక్.. నెక్ట్స్ టార్గెట్ దురంధర్ 2..!!


Read More:Mirnalini Ravi Wedding: ఆధ్యాత్మిక గురువు మహావిష్ణువును పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరా బ్యూటీ? గుర్తుపట్టారా?

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie