• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Adarsha Kutumbam Release Postpone: మూడు రోజుల్లో మూవీ రిలీజ్..అంతలోనే వెంకటేష్ సినిమా వాయిదా..ఎందుకు?

Adarsha Kutumbam Release Postpone: మూడు రోజుల్లో మూవీ రిలీజ్..అంతలోనే వెంకటేష్ సినిమా వాయిదా..ఎందుకు?

Adarsha Kutumbam Movie Release Postpone: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం-ఏకే 47' చిత్రం దసరా పోటీ నుంచి ఊహించని విధంగా తప్పుకుంది. మరో మూడు రోజుల్లో అనగా అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఈ చిత్రాన్ని అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Written ByHarish Darla
Published: Oct 05, 2026, 04:55 PM IST|Updated: Oct 05, 2026, 05:00 PM IST
joinshare
Adarsha Kutumbam Release Postpone: మూడు రోజుల్లో మూవీ రిలీజ్..అంతలోనే వెంకటేష్ సినిమా వాయిదా..ఎందుకు?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

Fauzi Movie Leaked: ప్రభాస్ 'ఫౌజీ' సినిమా నుంచి మరో లీక్? 1.09 నిమిషాల వీడియో బయటకు..వీడియో తేడాగా ఉంది!

2

Adarsha Kutumbam Release Postpone: మూడు రోజుల్లో మూవీ రిలీజ్..అంతలోనే వెంకటేష్ సినిమా వాయిదా..ఎందుకు?

3

కాంతి వెలుగుల్లో మెదడు మర్మం.. ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్..!!

4

Pithapuram Temples: టెంపుల్ టూరిజంగా ‘పీఠికాపురం’.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్

5

బరువు తగ్గాలనుకుంటున్నారా?.. సాయంత్రం ఆకలేస్తే తినే 10 'జీరో గిల్ట్' హెల్తీ స్నాక్స్ ఇవే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Adarsha Kutumbam Movie Release Postpone: పండగల సమయంలో పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలవుతుంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. పండగ వినోదంతో పాటు అభిమాన కథానాయకుడి సినిమాని వెండితెరపై చూడడం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలన్నీ పండగలను లేదా వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ విడుదలవుతుంటాయి. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో విక్టరీ వెంకటేశ్ నటించిన చిత్రాలు ప్రతి సంక్రాంతికి విడుదల కావడం, అది బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడం ఆనవాయితీగా మారింది.

గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే, ఈ ఏడాది సంక్రాంతి పండక్కి మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రంలో వెంకటేశ్ ఒక ప్రత్యేక (క్యామియో) పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. అంతకుముందు 2019 సంక్రాంతి రేసులో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'జనవరి 12 విడుదల' అనే చిత్రంతో ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా డేట్‌ను ప్రకటించారు.

అయితే, సంక్రాంతి కంటే ముందే ఈ ఏడాది దసరా కానుకగా వెంకటేశ్ నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుతుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

దసరా కానుకగా అక్టోబర్ 9న 'ఆదర్శ కుటుంబం - ఏకే 47' విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినప్పటికీ, అనూహ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో సడెన్ గా మూవీ వాయిదా పడటంతో వెంకటేశ్ అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. కాగా, ఈ మూవీని అక్టోబర్ 30న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Movie