• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘అ’ తెలుగు తెరపై మరో ఇంట్రెస్టింగ్ మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. నవంబర్ 12న విడుదల..

‘అ’ తెలుగు తెరపై మరో ఇంట్రెస్టింగ్ మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. నవంబర్ 12న విడుదల..

AH Mysterious Thriller: రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం'అ' (‘AH) ’.ఇప్పటికే ఈ సినిమా నుంచి అడివి శేష్ విడుద చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన ఈ చిత్రం గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ డేట్‌ను విడుదల చేశారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 28, 2026, 02:08 PM IST|Updated: Oct 28, 2026, 10:11 PM IST
joinshare
‘అ’ తెలుగు తెరపై మరో ఇంట్రెస్టింగ్ మిస్టిరీయస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. నవంబర్ 12న విడుదల..
Image Credit: AH Movie Release Date (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TGPSC Jobs: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త.. 102 పోస్టులతో నోటిఫికేషన్ జారీ.. డిటెయిల్స్..

TGPSC Jobs: నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో శుభవార్త.. 102 పోస్టులతో నోటిఫికేషన్ జారీ.. డిటెయిల్స్..

2

CM Revanth reddy: కృత్రిమ కొరత సృష్టిస్తే తాటతీస్తాం.. రైస్ మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వార్నింగ్..

3

Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..

4

AP School Holiday: అర్నబ్ తుపాన్ బీభత్సం.. ఏపీలోని 10 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు.!.

5

Trivikram Srinidhi Shetty: హీరోయిన్ శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన డైరెక్టర్ త్రివిక్రమ్..'ఆదర్శ కుటుంబం' వేడుకలో ఆసక్తికర ఘటన!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AH Release Date: తెలుగు తెరపై కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు లో వస్తోన్న మరో చిత్రం ‘అ’ (AH). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌తో పాటు లిరికల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అంతేకాదు రీసెంట్‌గా ‘ఇదేనా ఇదేనా’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో  వైరల్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్‌ 30న విడుదల చేయానుకున్నారు. చివరి నిమిషయంలో  మేకర్స్ చిత్రాన్ని నవంబరు 12న గ్రాండ్‌గా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా మేకర్స్‌ విడుదల తేది కోసం రిలీజ్‌ చేసిన కాన్సెప్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

డెబ్యూ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌ ను కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి బాలి డైరెక్ట్ చేశారు.

తాజాగా చిత్ర దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ ''  అందరి సపొర్ట్‌తో బెస్ట్‌ అవుట్‌ పుట్‌ ఇచ్చాను. , టైటిల్‌ చుట్టు ఉన్న అమ్మాయి.. అదృశ్యం.. అన్వేషణ, అనుమానం.. అసాంఘీకం... అమానుషం ఈ పదాల మధ్యే ఈ కథ మొత్తం ఉంటుందన్నారు. రాహుల్ విజయ్‌ను ఓ సీన్సియర్‌ పోలీస్ ఆఫీసర్‌గా పాత్రలో నటించారు. ఇన్వెస్టిగేషన్ డ్రామాలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ అట్రాక్టివ్‌గా ఉండనుంది.  నవంబరు 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందటం పక్కా అని కాన్ఫిడెన్స్‌గా చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ '' విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా ఈ చిత్రం తెరకెక్కించాము.  రాహుల్‌ విజయ్‌ కెరీర్‌లో ఈ సినిమా విభిన్నమైన  మైల్‌ స్టోన్‌గా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. . ఈ సినిమా నవంబరు 12న ఫర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో విడుదల చేస్తున్నాము. ' అ' మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను థ్రిల్ల్‌ పంచడం పక్కా అని చెబుతున్నారు.

మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన సీన్స్‌తో  కూడిన డార్క్ థ్రిల్లర్‌గా ‘AH’ తెరకెక్కుతున్నట్లు ప్రచార చిత్రాలు  చూస్తే తెలుస్తుంది.  అక్టోబర్ 30న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడం పక్కా అని చెబుతున్నారు. ఈ సినిమాలో రాహుల్ విజయ్, అర్చన అయ్యార్‌తో పాటు జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News