SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా ఆగిపోయిందా..? అసలేం జరగుతుంది..?

Allu Arjun - Lokesh Kanagaraj movie Shelved: అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సామాజి మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఈ ప్రచారంలో నిజమెంత..? లోకేష్ చెప్పిన కథ బన్నిని మెప్పించలేదా..? అసలు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమా పూర్తయిన తర్వాత ఐకాన్ స్టార్ లైనప్ ఏంటి..? అనుకున్నట్లుగానే లోకేష్ సినిమా ఉంటుందా లేదంటే వేరే దర్శకుడితో చేస్తారా అనేది చూడాలి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 11, 2026, 07:27 AM IST | Updated: Oct 11, 2026, 07:30 AM IST
Image Credit: Allu Arjun Lokesh Kanagaraj movie (X/Source)
Join

Allu Arjun Lokesh Movie Cancelled: అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై టీం సైలెంట్‌గా ఉండటం, లోకేష్ హీరోగా కథలు వింటుండటంతో నిజమే అనే టాక్ కూడా ఆ మధ్య నడిచింది. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్  పీఆర్ టీమ్ ఫుల్ క్లారిటీ ఇస్తూ.. అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆన్‌టైమ్ ఉంటుందని కన్ఫర్మ్ చేసారు.

కథతో మెప్పించలేకపోయిన లోకేష్ కనగరాజ్.. 
లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్  సినిమా విషయంలో తెరవెనక మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా గట్టిగా వినిపిస్తోంది, అదేంటంటే లోకేష్ చెప్పిన కథ బన్నీకి పూర్తిగా కనెక్ట్ కాలేదనేది మరో అభిప్రాయం.  అందుకే ఈ స్క్రిప్ట్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మార్చేందుకు, కొత్త వెర్షన్ రెడీ చేయడానికి లోకేష్ దాదాపు మూడు నెలల టైమ్ అడిగినట్లు తెలుస్తుంది. ఈ గ్యాప్‌లో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి.. బన్నీని పూర్తి స్థాయిలో మెప్పించేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  

అట్లీ మూవీ తర్వాత లోకేష్ మూవీ.. 
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' సినిమాను పూర్తి చేసే పనిలో ఐకాన్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది పూర్తైన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు. అది కూడా పూర్తిగా అల్లు అర్జున్ కథపై శాటిస్ఫై అయితేనే. ఈ లోపు మరో దర్శకుడితో అల్లు అర్జున్ సెట్స్ పైకి వెళతాడా అనేది చూడాలి మరి. ఇక లోకేష్ కనగరాజ్‌తో చేయబోయే సినిమాకు  అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. త్వరలోనే AA23కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్నాయి. ప్రస్తుతం బన్నీ ఫోకస్ అంతా రాకాపైనే ఉంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES