SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను వణికిస్తోన్న తుపాను.. భయం భయంగా హీరోలు, నిర్మాతలు..

AP Toofan Effect on Telugu cinema: తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను ఎప్పుడూ కలెక్షన్ల వర్షం ముంచెత్తుతూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం ఏపీలో విజృంభిస్తున్న తుపాను నిండా ముంచుతుందనే చెప్పాలి. ప్రకృతి బీభత్సంతో చాలా ఏరియాలు నీట మునగడంతో కొత్త సినిమాల మేకర్స్‌లో విపరీతమైన టెన్షన్ మొదలైంది. కొన్ని చోట్ల ఆర్నాబ్ తుపాను కారణంగా కొన్ని గ్రామాలకు వారం రోజులుగా కరెంట్ లేదు. ఇపుడు మురాసు కూడా ఏపీని ముంచెత్తుతుంది. ముఖ్యంగా ఈ ఎఫెట్ వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ పై స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే ‘రామాయణ’ సినిమాపై తుపాను ఏ ఎఫెక్ట్ ఎంత వరకు ఉండబోతుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 02, 2026, 05:59 AM IST | Updated: Nov 02, 2026, 06:00 AM IST
Image Credit: Toofan Effect on Box office (AI Pic/Source)
Join

Toofan Effect on Tollywood movies: అక్టోబర్ 30న ఆదర్శ కుటుంబం, విశ్వక్ సేన్ కల్ట్ సినిమాలు విడుదలయ్యాయి.  అయితే ఏపీలో అర్నబ్ తుఫాన్ వల్ల భారీ వర్షాలు, కరెంట్ కోతలతో జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్ల వైపు అడుగులేయడం లేదు. ఆదర్శ కుటుంబానికి తుపాను తీవ్ర ప్రభావం ఉన్న చోట థియేటర్స్ నడవడం లేదు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఆర్నాబ్ తర్వాత మురాసు.. 
మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితులు కొంతమేర చక్కబడతాయని నిర్మాతలు పాజిటివ్ హోప్స్‌తో ఎదురుచూస్తున్నారు. మొత్తంగా మొదటి రోజు ఈ రెండు సినిమాలపై గట్టిగానే పడింది. అంతా బాగుంటే వసూల్లు మరింత పెరిగేవి. మురాసు తుపాను ప్రభావం రాబోయే ‘రామాయణ’ తో పాటు అప్ కమింగ్ సినిమాలపై ఉంది. అప్పటి వరకు అంతా చక్కబడుతుందా.. తుపాను తర్వాత ఏర్పడే నష్టాల వల్ల ప్రజలు థియేటర్స్ వైపు అడుగులు వేస్తారా అనేది చూడాలి.

ఆదర్శ కుటుంబంపై ఎఫెక్ట్.. 
ఆంధ్రాలో ఆదర్శ కుటుంబం సినిమాను రూ. 20 కోట్లకు అమ్మారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నైజాం, సీడెడ్ ఏరియాలే అత్యంత కీలకం.  ప్రస్తుతం వాతావరణం ప్రతి కూలంగా ఉంది. ఈ బుధవారం వరకే సమయం ఉంది.  ఆ లోపు ఎంత రివకరీ రాబడుతుందో చూడాలి మరి. ఇక మూడు రోజుల్లో ఆదర్శ కుటుంబం సినిమా రూ. 30 కోట్ల వరకు షేర్ (రూ. 60 కోట్ల గ్రాస్)కలెక్సన్స్ రాబట్టింది. ఇక ‘కల్ట్’ మూవీ మూడు రోజుల్లో రూ. 2 కోట్ల షేర్ (రూ. 4 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా చూసుకుంటే తుపాను ప్రభావం లేకుంటే ఏపీ నుంచి ఈ సినిమాలకు మంచి వసూల్లే దక్కేవి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES