• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘బా బా బ్లాక్ షీప్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!!

‘బా బా బ్లాక్ షీప్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!!

Baa Baa Black Sheep Review: ‘బా బా బ్లాక్ షీప్’ ఇంగ్లీష్ రైమింగ్ ఎంత ఫేమసో తెలిసిందే కదా. ఇపుడీ టైటిల్‌తో గుణి మంచికంటి దర్శకత్వంలో వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. జాతీయ ఉత్తమ నటుడు ఉపేంద్ర లియాయో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు అలరించిందో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 09, 2026, 05:01 PM IST|Updated: Oct 10, 2026, 12:44 PM IST
joinshare
‘బా బా బ్లాక్ షీప్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!!
Image Credit: Baa Baa Black Sheep Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రూ.10 వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. అమెజాన్ సేల్‌లో Redmi, Realme, Samsung ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు!

రూ.10 వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. అమెజాన్ సేల్‌లో Redmi, Realme, Samsung ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు!

2

Dasara Festival: దసరా, బతుకమ్మ పండగలు.. సైబరాబాద్ పోలీసుల బిగ్ అలర్ట్.. అసలు విషయం ఇదే..

3

Rakul Preet Singh Birthday: నడిరోడ్డుపై ఆకతాయిని చితక్కొట్టిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్! ఏం జరిగిందంటే?

4

గేమింగ్ ప్రియులకు Infinix గుడ్‌న్యూస్.. GT 50 Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

5

Dussehra Bank Holidays: బ్యాంకు వినియోగదారలుకు అలర్ట్.. దసరా వారంలో 6 రోజులు బ్యాంకులకు సెలవు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

మూవీ రివ్యూ : బా బా బ్లాక్ షీప్ (Baa Baa Black Sheep)
న‌టీన‌టులు: ఉపేంద్ర లిమాయె, టిను ఆనంద్,  రాజా ర‌వీంద్ర‌, అక్ష‌య్ లగుసాని, విష్ణు ఓయ్‌, కార్తికేయ‌, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్ విస్మ‌య శ్రీ, మాల్వీ మ‌ల్హోత్రా, స‌మృద్ధి ఆర్య‌ల్‌, , కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శివన్నారాయణ, అనీష్ కురువిల్లా త‌దిత‌రులు
మ్యూజిక్ : ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ)
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అజయ్ అబ్రహం జార్జ్
బ్యాన‌ర్‌:  చిత్రాల‌యం స్టూడియోస్ 
నిర్మాత‌:  వేణు దోనేపూడి
ద‌ర్శ‌క‌త్వం:  గుణి మంచికంటి

ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు టైటిల్‌తో ‘బా బా బ్లాక్ షీప్’ సినిమా ప్రేక్షకుల్లో ఓ రకమైన క్రేజ్ సంపాదించుకుంది. పైగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మేఘాల‌యాలో షూటింగ్ జరుపుకున్న తొలి సౌత్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మరి ఈ ఫ్రైడే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం.  

కథ విషయానికొస్తే..

మన దేశంలో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడానికి ఇద్దరు బిజినెస్ మెన్స్ పోటీ పడ్డారు. అయితే వారిలో ఒకరు తన వంతు లాబీయింగ్ చేసుకునే పనిలో ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న ఓ  పెద్దాయనను మెప్పు పొందాలనుకుంటాడు.  దాని కోసం తన అసిస్టెంబ్ (శుభలేఖ సుధాకర్) తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో స్వాతంత్య్ర సంగ్రామంలో కనిపించుకుండా పోయిన ఓ వస్తువును ఎలాగైనా సంపాదించి  ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు. ఆ పనిని గ్యాంగ్‌స్టర్ జాన్ (ఉపేంద్ర లిమాయో)కు అప్పగిస్తాడు.

మరోవైపు సత్యనారాయణ (విష్ణు) తన ప్రియురాలు మేరి (సమృద్దిని) మేఘాలయలో ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరోవైపు సత్తిపండు అలియాస్ సత్యనారాయణ దోస్తు సందీప్ (అక్షయ్ లగుసాని) పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ చేసుకోవాలనుకునే లోపు  పోలీసుల ఎంట్రీతో ఆ పార్టీకి బ్రేక్ పడుతుంది.  మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో  సందీప్‌, స‌త్య ఇద్దరు  క‌లిసి కారులో పారిపోతున్న క‌మ్రంలో ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. మరోవైపు కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సందీప్ అక్క‌డ దొరికిన ఓ బాక్స్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ త‌ర్వాత స‌త్య‌, మేరి పెళ్లి జ‌రుగుతున్న స‌మ‌యంలో అక్క‌డ‌కు గ్యాంగ్ స్ట‌ర్ జాన్‌ ఎంట్రీతో కథ కీలక మలుపు తిరుగుతుంది. క‌నిపించ‌కుండా పోయిన త‌న బాక్స్ ఎక్క‌డ? అంటూ అడ‌గ‌ట‌మే కాకుండా సందీప్, స‌త్తిపండుని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెడతాడు. అసలు ఆ బాక్సులో ఏముంది..? సత్తి, మేరిల పెళ్లి చివరకు జరిగిందా..? చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికస్తే.. 
‘బా బా బ్లాక్ షీప్‌’ క‌థ‌ను డైరెక్టర్ గుణి మంచికంటి క్రైమ్ కామెడీ తరహాలో తెరకెక్కించాడు. గతంలో తెలుగు సహా హిందీలో వచ్చిన ధమాల్ సిరీస్‌ను స్పూర్తిగా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను దర్శకుడు పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించాడు. అది కూడా వ్యాపారస్తుల ఆధిపత్య పోరులో ఒకరిపై మరొకరి పై చేయి సాధించే క్రమంలో ఓ కీలకమైన వస్తువును చేజిక్కించుకునే క్రమంలో ఓ గ్యాంగ్ స్టర్ ను పురామించడం..  ఆ తర్వాత ఆ వస్తువు తప్పిపోయి హీరో గ్యాంగ్ చేతిలో పడటం.. దాన్ని చేజిక్కించుకోవడానికి విలన్ గ్యాంగ్ ప్రయత్నాలు అన్ని రొటీన్‌గా సాగినా.. మేఘాలయ వంటి ప్రదేశంలో అద్భుతమైన లొకేషన్స్‌లో తీసిన సీన్స్ ప్రేక్షకులను నవ్వు తెప్పిస్తాయి. మొత్తంగా రెగ్యులర్ క్రైమ్ కామెడీనే కాస్త డిఫరెంట్‌గా కొత్త ప్రదేశంలో షూట్ చేయడం ఆడియన్స్‌కు కొత్తగా కనిపిస్తుంది.

అజ‌య్ అబ్ర‌హం జార్జ్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాణ విలువులు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ పర్వాలేదు. ఎడిటర్ ఈ సినిమాను ఇంటర్వెల్ ముందు వరకు కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. మొత్తంగా కథలో ట్విస్టులు, కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ఈ వీకెండ్ కామెడీ కోరుకునే ప్రేక్షకులు సరదగా చూసి నవ్వుకోవచ్చు.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే..

ఉపేంద్ర లిమాయే గ్యాంగ్ స్టర్‌లో పాత్రలో ఒదిగిపోయాడు. సంక్రాంతి వస్తున్నాం తర్వాత ఈ సినిమాలో తన ఎనర్జిటిక్ కామెడీతో అలరించారు.  అజ‌య్ ల‌గుసాని కామెడీతో  ఆక‌ట్టుకున్నాడు. న‌ట‌న‌తో పాటు డాన్సుల్లో ఈజ్ చూపించాడు. స‌త్తిపండు పాత్ర‌లో విష్ణు ఓయ్ పాత్ర ఓ మోస్తరుగా ఉంది. అతని లుక్‌, డైలాగ్ డెలివ‌రి ఇవ‌న్నీ కాస్త డిఫ‌రెంట్‌గా అనిపిస్తాయి. మిగిలిన నటీనటులకు పెద్దగా నటించే ఆస్కారమే దక్కలేదు.

పంచ్ లైన్..  ‘బా బా బ్లాక్ షీప్‌’.. అలరించే క్రైమ్ కామెడీ మూవీ..

రేటింగ్: 3/5

Add Zee News as a Preferred Source
TAGS:
Movie Review
Telugu Movie
Tollywood