• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /కొడుకు కోసం సింహం దిగుతోంది..!..మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య బ్లాస్ట్..?

కొడుకు కోసం సింహం దిగుతోంది..!..మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య బ్లాస్ట్..?

Mokshagna Vassishta Movie: నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రంపై ఎట్టకేలకు ఆసక్తికరమైన కదలిక మొదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో దర్శకుడు వశిష్ట కాంబినేషన్‌లో మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఖరారైనట్లు వార్తలు రావడంతో నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అదే.. కొడుకు మొదటి సినిమా కోసం స్వయంగా బాలయ్య రంగంలోకి దిగబోతున్నారనే వార్త!

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 24, 2026, 08:42 AM IST|Updated: Oct 24, 2026, 08:45 AM IST
joinshare
కొడుకు కోసం సింహం దిగుతోంది..!..మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య బ్లాస్ట్..?
Image Credit: Balakrishna - Mokshagna (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

Karnataka: వామ్మో..యూట్యూబ్ చూసి భర్త హత్యకు స్కెచ్..ఇడ్లీలో ఉమ్మెత్త పొడి కల్పి మరీ దారుణం.!.

2

శని పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఆర్థిక కష్టాలు దూరం.. ఆదాయం పెరిగే ఛాన్స్!

3

దీపావళి పూజకు వాడే వెండి, రాగి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో తళతళ మెరిపించండి!

4

‘రణబాలి’కి ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటిస్తుందా..!

5

తులారాశిలో బుధుడి తిరోగమనం.. అక్టోబర్ 24 నుంచి ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Balakrishna Cameo Role: సాధారణంగా స్టార్ హీరోల వారసుల ఎంట్రీ అంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అందులోనూ నందమూరి కుటుంబం నుంచి వస్తున్న హీరో కావడంతో మోక్షజ్ఞ తొలి సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని, తాత ఎన్టీఆర్, తండ్రి బాలకృష్ణ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞను ప్రేక్షకులకు ఎలా పరిచయం చేయాలి? ఎలాంటి కథతో లాంఛ్ చేయాలి? అభిమానుల అంచనాలను ఎలా అందుకోవాలి? అన్నది దర్శకుడికి పెద్ద సవాల్‌గా మారనుంది.

బాలయ్య పవర్‌ఫుల్ కెమియో..

ఇలాంటి సమయంలో బాలయ్య కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారనే ప్రచారం మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందట. బాలకృష్ణ లాంటి మాస్ హీరో స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. థియేటర్లలో అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైలాగ్ చెప్పినా, ఒక్క లుక్ ఇచ్చినా ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి బాలయ్యను మోక్షజ్ఞ తొలి సినిమాలో ఎక్కువసేపు చూపిస్తే.. ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆయన పాత్రపైనే నిలిచిపోయే అవకాశం ఉంది.

దీంతో హీరోగా పరిచయమవుతున్న మోక్షజ్ఞకు రావాల్సిన ప్రాధాన్యం తగ్గకూడదనే ఉద్దేశంతో దర్శకుడు వశిష్ట ఓ ఆసక్తికరమైన ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

కథ ప్రారంభంలో పవర్‌ఫుల్ పాత్రలో బాలయ్య..

ఆ ప్రచారం ప్రకారం.. బాలయ్య పాత్రను సినిమా మొత్తం కొనసాగించకుండా, కథ ప్రారంభంలోనే ఓ పవర్ ఫుల్ గెస్ట్ అప్పియరెన్స్‌గా డిజైన్ చేయాలని భావిస్తున్నారట. కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించినా.. ఆ పాత్ర ప్రభావం మాత్రం సినిమా మొత్తం ఉండేలా కథను మలుస్తున్నారని టాక్. బాలయ్య ఎంట్రీతో కథకు బలమైన పునాది వేసి, ఆ తర్వాత అసలు ప్రయాణాన్ని మోక్షజ్ఞ పాత్రతో ముందుకు తీసుకెళ్లాలనేది దర్శకుడి ఆలోచనగా చెబుతున్నారు.

అంటే తండ్రి క్రేజ్‌తో సినిమాకు భారీ ఓపెనింగ్ ఇవ్వడం.. ఆ తర్వాత కొడుకు పాత్రను అంతకుమించిన స్థాయిలో ఎలివేట్ చేయడం అన్నమాట!

నందమూరి అభిమానులు డబుల్ ట్రీట్.. 
ఇదే నిజమైతే నందమూరి అభిమానులకు ఒకే సినిమాలో డబుల్ ట్రీట్ దక్కినట్లే. ఒకవైపు నటసింహం బాలయ్య పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్.. మరోవైపు వారసుడు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. ఈ రెండు అంశాలు కలిస్తే థియేటర్లలో అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అయితే మోక్షజ్ఞ మొదటి సినిమా కేవలం బాలయ్య క్రేజ్ మీద ఆధారపడి ఉండకుండా, తన నటనతోనే ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దడం కూడా చాలా ముఖ్యం. తొలి చిత్రంలోనే హీరో క్యారెక్టర్ బలంగా నిలబడితే భవిష్యత్తులో మోక్షజ్ఞ కెరీర్‌కు అది మంచి పునాదిగా మారుతుంది. అందుకే బాలయ్య పాత్రను పరిమితంగా ఉంచి, కథలో దానికి అత్యంత కీలకమైన ప్రాధాన్యం కల్పించాలనే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం.

ఒకే ఫ్రేములో బాలకృష్ణ - మోక్షజ్ఞ

మరోవైపు తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రచారం నిజమైతే వారి కోరిక నెరవేరినట్లే. ముఖ్యంగా బాలకృష్ణ తనయుడిని వెండితెరపై పరిచయం చేసే సన్నివేశం ఉంటే మాత్రం అది అభిమానులకు మరింత ప్రత్యేకంగా నిలిచిపోయే అవకాశం ఉంది.

మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అయితే బాలకృష్ణ గెస్ట్ రోల్, ఆయన పాత్ర నిడివి, కథలో ఆ పాత్ర ప్రాధాన్యం గురించి వస్తున్న కథనాలన్నీ ప్రస్తుతానికి ఇండస్ట్రీ ప్రచారం మాత్రమే. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి వారసుడి కోసం నటసింహం నిజంగానే రంగంలోకి దిగుతారా? బాలయ్య మాస్ ఇమేజ్‌ను మోక్షజ్ఞ గ్రాండ్ లాంచ్‌కు వశిష్ట ఎలా ఉపయోగించుకోబోతున్నారు? ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న!
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News