• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Bigg Boss Krishna: ట్రోలింగ్ కోసం నెలకు రూ.30 వేలు రోహిత్ చెల్లిస్తున్నారు..బిగ్‌బాస్ కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు..

Bigg Boss Krishna: ట్రోలింగ్ కోసం నెలకు రూ.30 వేలు రోహిత్ చెల్లిస్తున్నారు..బిగ్‌బాస్ కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు..

Bigg Boss Krishna: బిగ్‌బాస్ నుంచి ఇటీవల ఎలిమినేట్ అయిన కృష్ణ ప్రస్తుతం తన ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో తన అనుభవాలతో పాటు తోటి కంటెస్టెంట్ల గురించి కూడా కృష్ణ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రోహిత్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.

Written ByVishnu Priya
Published: Oct 02, 2026, 10:09 PM IST|Updated: Oct 02, 2026, 10:13 PM IST
joinshare
Bigg Boss Krishna: ట్రోలింగ్ కోసం నెలకు రూ.30 వేలు రోహిత్ చెల్లిస్తున్నారు..బిగ్‌బాస్ కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు..

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీకి కొత్త పేరు పెట్టిన బండి సంజయ్‌.. ఏమిటో తెలుసా?

2

Vande Bharat Sleeper: ఏపీకి భారీ శుభవార్త.. రెండు ప్రధాన నగరాల మధ్య వందే భారత్‌ స్లీపర్‌ రైలు

3

Sitara Ghattamaneni: సితార మాటల్లో పక్కా తెలంగాణ స్లాంగ్.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కొత్త ట్రీట్!

4

Fahadh Faasil: నేను వేసుకున్న బంగారం మొత్తం నా భార్యవే.. ఫహాద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

5

Bigg Boss Krishna: ట్రోలింగ్ కోసం నెలకు రూ.30 వేలు రోహిత్ చెల్లిస్తున్నారు..బిగ్‌బాస్ కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bigg Boss Krishna: బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో కృష్ణ, రోహిత్ మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బయటకు వచ్చిన తర్వాత కూడా వారి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను కృష్ణ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

కృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. ఒకసారి తన భార్య బిగ్‌బాస్ హౌస్‌కు కాస్ట్యూమ్స్ ఇవ్వడానికి వెళ్లిందట. ఆ సమయంలో రోహిత్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ చూసుకునే వ్యక్తి ఆమెకు కనిపించాడని కృష్ణ తెలిపారు. ఆ వ్యక్తి తన భార్యతో ఒక విషయం చెప్పాడని ఆయన పేర్కొన్నారు.

రోహిత్ గురించి నెగెటివ్‌గా మాట్లాడే వారిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి తనకు నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నారని ఆ వ్యక్తి చెప్పినట్లు కృష్ణ వెల్లడించారు. అయితే ఈ విషయం తన భార్య తనకు వెంటనే చెప్పలేదని, తాను బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పిందని కృష్ణ తెలిపారు.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by iDream Celebrities (@idreamcelebrities)


కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కృష్ణ చేసిన ఆరోపణ మాత్రమే. నెలకు రూ.30 వేలు చెల్లించి ట్రోలింగ్ చేయిస్తున్నారనే విషయానికి ఇప్పటివరకు స్వతంత్రంగా ఎలాంటి నిర్ధారణ లేదు.

అలాగే బిగ్‌బాస్‌లో పీఆర్ టీమ్స్, సోషల్ మీడియా సపోర్ట్ గురించి కూడా కృష్ణ మాట్లాడారు. షోలోకి వెళ్లే ముందు ఇలాంటి వ్యవహారాల గురించి తనకు తెలియదని చెప్పారు. తాను ఎలాంటి వ్యూహాలు లేకుండా నిజాయితీగా హౌస్‌లోకి వెళ్లానని తెలిపారు.

తనపై వచ్చిన ట్రోలింగ్‌పైనా కృష్ణ స్పందించారు. హౌస్‌లో తాను ఎక్కువగా నిద్రపోతున్నాడనే కామెంట్స్ వచ్చాయని, కానీ తాను ఒక్కసారి మాత్రమే నిద్రపోయానని చెప్పారు.

ఆహారం విషయంలో కూడా తనపై ట్రోలింగ్ జరిగిందని కృష్ణ తెలిపారు. తినడం కోసమే బిగ్‌బాస్‌కు వెళ్లలేదని, అలా అయితే హోటల్‌కు వెళ్లి తినేవాడినని చెప్పారు. హౌస్‌లో ఫుడ్ పరిమితంగానే ఉంటుందని, అయినప్పటికీ ఆహారానికి సంబంధించిన విషయాల్లో తనను ట్రోల్ చేశారని కృష్ణ అన్నారు.


Also Read: టాలీవుడ్‌లో ట్రేడ్ సర్కిల్స్‌లో రామాయణ, జైలర్ 2 సినిమాల బిజినెస్ డీల్స్..

Also Read: అనిరుథ్‌ను భయపెడుతున్న సాయి అభ్యంకర్..
 
 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Bigg Boss