SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లో మారిన ఓటింగ్ లెక్కలు.. డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరు?

Bigg Boss Telugu: బిగ్‌బాస్ తెలుగు 10 ఎనిమిదో వారంలో మరోసారి డబుల్ ఎలిమినేషన్ జరగబోతోందా? ఓటింగ్ ట్రెండ్స్‌లో ఎవరు ముందున్నారు? డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు? వీకెండ్ ఎపిసోడ్‌పై ఆసక్తి పెరుగుతోంది.

Written By Vishnu Priya
Published: Oct 30, 2026, 08:55 AM IST | Updated: Oct 30, 2026, 09:01 AM IST
Join

Bigg Boss Telugu Double Elimination: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తికావస్తుండటంతో హౌస్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ వారం మరోసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గత వారం దక్ష, షాలిని ఇద్దరూ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడు ఎనిమిదో వారం కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బిగ్‌బాస్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందనే విషయాన్ని సూచించారు.

ఈ వారం నామినేషన్లలో రోహిత్, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, ఝాన్సీ, శివ, రామకృష్ణ, యాంకర్ వర్షిణి, సుధీర్ ఉన్నారు. అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం రోహిత్, టెంపర్ వంశీ మంచి ఓట్లతో ముందంజలో ఉన్నారు. వీరిద్దరికీ ప్రస్తుతం పెద్దగా ఎలిమినేషన్ భయం లేదని తెలుస్తోంది.

మరోవైపు రామ్ ప్రసాద్ కూడా టాస్కుల్లో మంచి ప్రదర్శన చేయడంతో సేఫ్ అయ్యే అవకాశాలు కనిపించాయి. యాంకర్ వర్షిణి కూడా ఈ వారం కొన్ని టాస్కుల్లో తన ఆటను మెరుగుపరుచుకుంది. దీంతో ఆమె కూడా డేంజర్ జోన్ నుంచి బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక మిగిలిన కంటెస్టెంట్లలో రామకృష్ణ, ఝాన్సీ, శివ వంటి వారి పరిస్థితి ఆసక్తికరంగా మారింది. వీరిలో ఎవరు తక్కువ ఓట్లు తెచ్చుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారింది. డబుల్ ఎలిమినేషన్ నిజమైతే ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్‌ను వీడాల్సి ఉంటుంది.

అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఓటింగ్ లెక్కలు అధికారికమైనవి కావు. అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది వీకెండ్ ఎపిసోడ్‌లోనే స్పష్టమవుతుంది. హోస్ట్ నాగార్జున ఈసారి ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి. మరోసారి డబుల్ ఎలిమినేషన్ జరిగితే హౌస్‌లో పోటీ మరింత పెరగడం ఖాయం.

Also Read: 

ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు..కిలోపై ఎంత తగ్గిందంటే..? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, నష్టమా?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES