• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!

Mega Parent-Teacher Meeting: తెలంగాణ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థుల విద్య ప్రమాణాలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యాశాఖ పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలను నిర్వహించారు

Written ByBhoomi
Published: Oct 30, 2026, 09:53 AM IST|Updated: Oct 30, 2026, 09:54 AM IST
joinshare
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!
Image Credit: Mega Parent-Teacher Meeting

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్..  భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..!!

2

స్వాతి నక్షత్రంలో సూర్యుడి ఎఫెక్ట్‌.. వృషభం సహా 4 రాశులకు పట్టిందల్లా బంగారమే!

3

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 5న మెగా పీటీఎం.. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు..!!

4

సింహరాశిలోకి కుజుడు ఎంట్రీ.. ఈ రాశులవారికి ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

5

మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mega Parent-Teacher Meeting: తెలంగాణ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థుల విద్య ప్రమాణాలను మరింత మెరుగుపర్చడమే లక్ష్యంగా విద్యాశాఖ పలు కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ -1 పరీక్షలను నిర్వహించారు.

ఈ విద్యా ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు.. విద్యా ప్రమాణాలను కచ్చితంగా అంచనా వేసేందుకు కొన్ని జిల్లాల్లోని ఎంపిక చేసిన బడుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎక్స్ టర్నల్ ఎవల్యూషన్ చేపట్టింది.

అయితే ఈ ప్రక్రియలో భాగంగా బయట పాఠశాలల టీచర్లతో పేపర్లను దిద్దించారు. అయితే ఈ పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి.. సరిదిద్దాల్సిన లోపాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

అందుకోసం సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల ఫలితాల ఆధారంగా నవంబర్ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ డైరెక్ట్ నవీన్ నికోలస్ ఈ ఆదేశాలను జారీ చేశారు.

ఈనెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఏ1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా విద్యార్థులు సాధించిన మార్కులను నవంబర్ 5వ తేదీ లోపు ఆన్ లైన్ ఖచ్చితంగా నమోదు  చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. 


Also Read: 

మోదీ దీపావళి గిఫ్ట్ రూ. 8 వేల ఆఫర్ నిజమేనా? వాట్సాప్‌లో ఆ లింక్ వస్తే బీ అలర్ట్..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News