విశ్వంభర రిలీజ్ డేట్ అంతు చిక్కని మెగా సస్పెన్స్.. ? సినిమాకు మోక్షం ఎపుడో..!!
Vishwambhara New Release Date: చిరంజీవి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'విశ్వంభర' చుట్టూ అంతుచిక్కని సస్పెన్స్ నడుస్తూనే ఉంది. కళ్లముందు అద్భుతమైన సీజన్స్ మిస్ అవుతున్నా.. మేకర్స్ ఏమాత్రం అసలు ఈ సినిమా గురించి చెప్పకపోవడంతో ఈ చిత్రం అసలు వస్తుందా రాదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కేవలం VFX సమస్యే విశ్వంభరను ఆపుతుందా లేదంటే లోపల లోగుట్టు ఇంకేదైనా ఉందా..?
Vishwambhara Release Date Dailema: ‘విశ్వంభర’ ఆలస్యానికి కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే కారణమంటే ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. అదే గనక నిజమైతే ఇన్ని నెలల్లో పనులు పూర్తి చేసుకుని ఎప్పుడో ఏదో ఒక సాలిడ్ డేట్‌తో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేవాళ్లు. ‘ఆదర్శ కుటుంబం’ లాంటి పెద్ద సినిమా తప్పుకున్నా కూడా.. విశ్వంభర టీమ్ కనీసం మాట మాట్లాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
సంక్రాంతి సీజన్..
సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తారనుకుంటే అక్కడ కూడా చిరంజీవి నటిస్తున్న 'కాకా' జనవరి 13న రావడం ఫిక్స్ అయింది. అందులో వేరే ముచ్చటనే లేదు. తన సినిమాతో తానే పోటీ పడలేరు కాబట్టి విశ్వంభర ఆ రేసు నుంచి కూడా ఆటోమేటిక్‌గా తప్పుకున్నట్లే. మరి పోటీకి రిలీజ్ చేసే ధైర్యం చేస్తారా అనేది చూడాలి. ఈ లెక్కన చూస్తే మళ్లీ 2027 సమ్మర్ సీజన్ వచ్చే వరకు విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూడటం మినహా మరో ఆప్షన్ లేదు.
విశ్వంభరను పక్కన పెట్టి మోక్షజ్ఞ డైరెక్ట్..
మరోవైపు దర్శకుడు వశిష్ట విశ్వంభరను పక్కనబెట్టి నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై ఫోకస్ పెట్టారు. దర్శకుడు కూడా వేరే ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోవడంతో వచ్చినపుడు వస్తుందిలే ‘విశ్వంభర’ను నిజంగానే వదిలేశారేమో అనే టాక్ నడుస్తుంది. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఈ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందిప్పుడు. అంతేకాదు యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి సినిమాల తర్వాత చిరు నుంచి వస్తోన్న భారీ సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలున్నాయి. మరి మొత్తంగా ‘విశ్వంభర’ సినిమాకు మోక్షం కలిగిదెపుడో మరి.