Comrade Kalyan Review: శ్రీవిష్ణు కామెడీ ఎలా ఉంది.. నవ్వించిందా.. నిరాశపరిచిందా?
Comrade Kalyan Review: శ్రీవిష్ణు హీరోగా, జానకీరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ఈరోజు (అక్టోబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నక్సల్స్ నేపథ్యానికి ప్రేమ, కామెడీ, చిన్న సందేశాన్ని జోడించి రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? శ్రీవిష్ణు తన కామెడీతో నవ్వించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Comrade Kalyan Review: విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన తాజా చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించింది. రాధికా శరత్ కుమార్, సత్య, సుదర్శన్, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.
సాధారణంగా నక్సల్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలు సీరియస్‌గా ఉంటాయి. కానీ ఈసారి ఆ నేపథ్యానికి కామెడీని జోడించారు. మరి ఈ కొత్త ప్రయత్నం ఎంతవరకు ఫలించింది? సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని ఒక గ్రామంలో జరుగుతుంది. అక్కడ కళ్యాణ్ (శ్రీవిష్ణు) ఒక సినిమా థియేటర్ లీజ్‌కు తీసుకుని నడుపుతుంటాడు. విప్లవాత్మక సినిమాలను ప్రదర్శిస్తూ.. జనాలను ఆకర్షించి తన థియేటర్‌కు రప్పించుకుంటు ఉంటాడు. డబ్బులు బాగా సంపాదించి.. ఎప్పటికైనా ఆ థియేటర్‌ను కొనుక్కోవాలని లక్ష్యంతో ఉంటాడు. అతడి తల్లి (రాధిక) చేసే పనులతో అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. ఒకరోజు సితార (మహిమా నంబియార్) కళ్యాణ్ తల్లికి సహాయం చేస్తుంది. దీంతో కళ్యాణ్ ఆమెపై మనసు పారేసుకుంటాడు. అయితే అప్పటికే సితార కుటుంబం అప్పుల సమస్యలో చిక్కుకుంటుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తాడు.
సితార కుటుంబాన్ని ఆ సమస్య నుంచి బయటపడేయడానికి కళ్యాణ్ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం కళ్యాణ్ కామ్రేడ్ కళ్యాణ్‌గా ఎలా మారాడు..? ఆ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి..? పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య చిక్కుకున్న కళ్యాణ్ ఎలా బయటపడ్డాడు..? చివరికి తన ప్రేమను గెలుచుకున్నాడా..? అన్నదే మిగతా కథ.
ఎవరు ఎలా చేశారంటే..?
కళ్యాణ్ పాత్రలో శ్రీవిష్ణు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకంగా కనిపిస్తూ చేసే పనులు, చెప్పే డైలాగులు కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తాయి. శ్రీవిష్ణు, సుదర్శన్, సత్య మధ్య వచ్చే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. దుబాయ్ బాబుగా సత్య ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. సినిమా చివరి వరకు నవ్విస్తునే ఉంటాడు. మహిమా నంబియార్ నటనకు పెద్ద స్కోప్ లేకపోయినా.. ఉన్నంతో తన పాత్రకు న్యాయం చేసింది. కళ్యాణ్ తల్లిగా రాధికా శరత్ కుమార్ మంచి నటనను చూపించింది. వెన్నెల కిశోర్ తెరపై ఉన్నది కాసేపే అయినా.. ప్రేక్షకులను అలరించాడు. ఇక ఉపేంద్ర లిమయే రోల్‌కు బాగా ఆకట్టుకుంటుంది.
విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం బాగుంది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఉపయోగపడ్డాయి. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు కూడా మెప్పిస్తాయి. అయితే ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా వేగంగా సాగేది.
విశ్లేషణ
కామ్రేడ్ కళ్యాణ్‌లో ప్రధాన ఆకర్షణ నక్సల్స్ నేపథ్యానికి కామెడీని జోడించడం. మొదటి భాగంలో హీరో ప్రేమకథ, అతడి అల్లరి పనులు సరదాగా సాగుతాయి. సత్య పాత్ర ప్రవేశించిన తర్వాత కొన్ని సన్నివేశాలు మరింత వినోదాన్ని అందిస్తాయి.
రెండో భాగంలో పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య హీరో పడే ఇబ్బందులు కథలో ఆసక్తిని పెంచుతాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అతడు చేసే ప్రయత్నాలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. చివరి భాగంలో కథ మరింత సీరియస్‌గా మారుతుంది. సినిమాలోని సందేశం కూడా ఆలోచింపజేస్తుంది.
అయితే సినిమా మొదటి భాగం కొంత నెమ్మదిగా సాగుతుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు సహజంగా అనిపించవు. సీరియస్ నేపథ్యానికి హాస్యాన్ని జోడించినప్పటికీ, ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత కనిపించని సందర్భాలు ఉన్నాయి. కథలో కొత్తదనం ఉన్నా, కొన్ని సన్నివేశాలు సాధారణంగా అనిపిస్తాయి.
తీర్పు
మొత్తంగా కామ్రేడ్ కళ్యాణ్ ఒక కొత్త ప్రయత్నం. శ్రీవిష్ణు నటన, కొన్ని కామెడీ సన్నివేశాలు, సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. అయితే కథనం నెమ్మదిగా సాగడం, కొన్ని చోట్ల కామెడీ పండకపోవడం మైనస్‌లుగా మారాయి.
ఎక్కువ అంచనాలు లేకుండా, సరదాగా ఒక సినిమా చూడాలనుకునే వారికి కామ్రేడ్ కళ్యాణ్ ఒకసారి ప్రయత్నించదగిన చిత్రం. శ్రీవిష్ణు అభిమానులు కొన్ని సన్నివేశాలను ఆస్వాదించవచ్చు.
రేటింగ్: 3/5
Read More: Vijay Deverakonda: నన్ను తొక్కేయడం కోసం 1000 అకౌంట్లు.. విజయ్ దేవరకొండ బయటపెట్టిన భయంకర నిజం..!
Read More: Nana Patekar Death: అనుమానాస్పద మృతిగా కేసు.. నానాపాటేకర్ మరణంపై గోవా పోలీసుల కీలక నిర్ణయం.!.