• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

Captain Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్‌లో జరిగిన కత్తి దాడి ఘటనలో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కెప్టెన్ స్మిత్ మచ్చర్ కాపాడారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా మ్యాన్‌కైండ్‌ ఫార్మా కోటి రూపాయల బహుమతి ప్రకటించింది. ఈ ఘటనలో ప్రయాణికులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, కెప్టెన్ స్మిత్‌కు ప్రత్యేక ధైర్య పురస్కారం అందించాలని భారత పైలట్ల సమాఖ్య ప్రధాని మోదీకి లేఖ రాసింది.

Written ByHarish Darla
Published: Oct 03, 2026, 07:45 PM IST|Updated: Oct 03, 2026, 07:49 PM IST
joinshare
Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానం కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు జాక్‌పాట్..ధైర్యసాహసాలకు మెచ్చి రూ.కోటి నజరానా!

2

రూ.10,499కే HMD Vibe 2 5G ఫోన్‌.. దీపావళి స్పెషల్ ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

3

Court Sridevi Boyfriend: లవ్‌లో పడిన 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి..ప్రియుడి గురించి ఎట్టకేలకు బయటపెట్టేసింది!

4

Assam Night Club Incident: నైట్‌క్లబ్‌లో యువతిపై బౌన్సర్ల దాడి..అమ్మాయిని నగ్నంగా నిలబెట్టి, పిడిగుద్దులతో...

5

Bathukamma 2026 Dates: ఈ నెల 10వ తేదీ నుంచి బతుకమ్మ వేడుకలు.. ఏర్పాట్ల వివరాలు ఇవే..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Captain Smit Machchhar 1 Crore: ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్ లోపల అత్యంత భయాందోళనకర పరిస్థితి నెలకొంది. విమానంలోని సహ పైలట్ హమామ్ అల్ హమామిపై కత్తి దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు వ్యక్తి విమానాన్ని తన స్వాధీనంలోకి తీసుకుని, దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ప్రాణాలకు తెగించిన కెప్టెన్ స్మిత్ మచ్చర్..
ఈ కత్తి దాడి ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఆయన తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, అత్యంత సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపును తెరిచారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు వెంటనే స్పందించి కాక్‌పిట్‌లోకి వెళ్లారు. 

ప్రయాణికులు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కెప్టెన్ స్మిత్ చూపిన అసమాన ధైర్యసాహసాల వల్ల విమానంలోని 27 మంది చిన్నారులతో సహా మొత్తం 174 మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా కాపాడబడ్డాయి.

రూ. కోటి నజరానా ప్రకటన.. 
ప్రాణాలకు తెగించి విమానాన్ని, ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను మ్యాన్‌కైండ్‌ ఫార్మా సంస్థ ఘనంగా కొనియాడింది. ఆయనకు కోటి రూపాయల పారితోషికం (బహుమతి) అందజేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ప్రత్యేక ధైర్య పురస్కారానికి డిమాండ్.. 
కెప్టెన్ స్మిత్ మచ్చర్ చేసిన వీరోచిత పోరాటానికి తగిన గుర్తింపు ఇవ్వాలని పైలట్ల సమాఖ్య కోరింది. ఆయనకు ప్రత్యేక ధైర్య పురస్కారాన్ని అందజేయాలని భారత పైలట్ల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ భారత పైలట్ల సమాఖ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News