• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘డియర్ ఆస్ట్రోనాట్’ ఎవరినీ నిరాశ పరచదు.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

‘డియర్ ఆస్ట్రోనాట్’ ఎవరినీ నిరాశ పరచదు.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Dear Astronaut Song Launch: కార్తీక్ భాగ్యరాజ రచన, డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. యువన్‌కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటలను శేఖర్ కమ్ముల విడుదల చేసి మూవీ యూనిట్‌ను అభినందించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 10:34 AM IST|Updated: Oct 29, 2026, 08:39 PM IST
joinshare
‘డియర్ ఆస్ట్రోనాట్’ ఎవరినీ నిరాశ పరచదు.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Image Credit: Astronaut Song launch (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తులం బంగారం రూ. 2 లక్షలు కానుందా? పసిడి పరుగులు వెనుక అసలు లెక్కలు ఇవే..!!

తులం బంగారం రూ. 2 లక్షలు కానుందా? పసిడి పరుగులు వెనుక అసలు లెక్కలు ఇవే..!!

2

Hyderabad: ఎల్ నినో ఎఫెక్ట్ వేళ.. హైదరాబాద్ లో రోడ్డుపై ట్యాంకర్ నుంచి నీళ్ల వృథా.. వీడియో..

3

Cyclone Arnab Loss: అర్నాబ్‌ తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్‌ విలవిల.. రూ.4,600 కోట్ల అపార నష్టం

4

YS Jagan: చంద్రబాబువన్ని తప్పుడు లెక్కలు.. అర్నబ్ తుపాన్ ప్రభావంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

5

Chandrababu: అర్నాబ్‌ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన.. బాధితులతో ముఖాముఖి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sekhar Kammula Comments on Dear Astronaut:  ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనేది అంతరిక్షంలోకి ప్రయాణించాలనే ఓ యువతి స్టోరీ. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య  విహరించాలని కలలు కనే ఒక మహిళ కథగా  "డియర్ ఆస్ట్రోనాట్" చిత్రం తెరకెక్కుతోంది.  ఎవరు ఊహించని  కలను సాకారం చేసుకోవడానికి ఆమె సాగించే ప్రయాణాన్ని  ఈ మూవీలో చూపించబోతున్నారు.  ఆకాశాన్ని అందుకోవాలనే ఆమె ఆశయం వెనుక ఉన్న సవాళ్లు, పట్టుదల, ఆశ, భావోద్వేగాలను ఇందులో గొప్పగా  తెరపై చూపించనున్నారు. తాజాగా పాట విడుదల కార్యక్రమంలో శేఖర్ కమ్ముల సహా ఈ సినిమాకు సంబంధించిన యూనిట్ పాల్గొంది. అంతేకాదు ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు పాటను విడుదల చేశారు.

ఈ సందర్బంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ .. ‘‘ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను సినిమాను తీయడం మాములు విషయం కాదు.  ఈ అమ్మాయి చక్కగా నటించింది. ఇది చాలా మంచి ప్రయోగాత్మక చిత్రం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు. కానీ వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారన్నారు. టెక్నికల్లీ ఈ చిత్రం ఎంతో క్వాలిటీగా ఉందన్నారు. ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండని పిలుపు నిచ్చారు.

కమల్ కామరాజ్ మాట్లాడుతూ .. ‘‘డియర్ ఆస్ట్రోనాట్’ లాంటి చిత్రాన్ని తెర మీదకు తీసుకు రావడమే గొప్ప సాహసం లాంటి కథ. కథకు ప్రాధాన్యమున్న చిత్రమిది. ఓ అమ్మాయి, వారి భావోద్వేగాలను చూపించే సినిమా. కలలు కంటే సాకారం అవుతాయా? లేదా? అన్నది మనకు తెలీదు. కానీ పెద్ద కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలని చెప్పే గొప్ప సందేశంతో ఈ మూవీని తెరకెక్కించారని చెప్పుకొచ్చారు.  అందరికీ స్పూర్తినిచ్చే చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.  

నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ .. ‘శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భాగ్యరాజా నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చారు. సౌమిత్  అద్భుతంగా నటించారు. ఆకాశ్, అంజలికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నవంబర్ 20న ఈ చిత్రం రాబోతోంది. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. అందరూ తప్పక చూసి ఆదరించాలని కోరాు. ఈ కార్యక్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు పాల్గొని ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.  

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News