• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘DNK’ సినిమా రివ్యూ.. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఎలా ఉందంటే..!!

‘DNK’ సినిమా రివ్యూ.. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఎలా ఉందంటే..!!

DNK Review: మౌళి టాక్స్ పేరుతో యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో అలరించిన మౌళి.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో సడన్‌గా హీరో ప్రమోషన్ అందుకున్నాడు. అంతేకాదు తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ కోవలో మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ బ్యానర్‌లో ‘దొంగ నా కొడుకు’. సినిమా చేశాడు. సెన్సార్ వాళ్లు ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో టైటిల్‌ను DNK గా మార్చారు. మరి ఆ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 13, 2026, 12:00 PM IST|Updated: Nov 13, 2026, 04:00 PM IST
joinshare
‘DNK’ సినిమా రివ్యూ.. ‘దొంగ నా కొడుకు’ సినిమా ఎలా ఉందంటే..!!
Image Credit: DNK Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

మీ జ్ఞాపకశక్తి పెరగాలన్నా.. గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే!

2

Love Failure: కులం అడ్డంకితో ప్రేమ విఫలం.. కాబోయే మహిళా ఎస్సై ఆత్మహత్య

3

యువకుడిని క*త్తులతో పొడిచి.. స్కూటర్‌పై ఇంటి ముందు పడేసిన దుండగులు.. వీడియో!

4

రైల్వే శాఖ సంచలన నిర్ణయం.. త్వరలోనే RAC టికెట్ల రద్దు? ప్రయాణికులకు ఇకపై ఫుల్ బెర్త్ గ్యారెంటీ!

5

India Vs New Zealand: టీమిండియాకు ఘోర అవమానం.. వన్డే చరిత్రలో రెండో అతిపెద్ద ఓటమి..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

DNK Public Talk: గత కొంత కాలం సోషల్ మీడియాలో తన వీడియోలతో అలరించిన మౌళి హీరోగా నటించిన రెండో చిత్రం ‘డీఎన్‌కే’. లాస్ట్ ఇయర్ ‘లిటిల్ హార్ట్స్‌’ తో మంచి విజయాన్ని అందుకున్న ఇతను.. తాజాగా శ్రీను కంబాల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. మరి ఈ సినిమాతో మౌళి హీరోగా మరో సక్సస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

ఈశ్వర్ (మౌళి) చదువు సరిగా అబ్బదు. దీంతో క్రికెట్ బెట్టింగ్స్, ఆన్ లైన్ జూదాలతో ఈజీ మనీ సంపాదించి కోటీశ్వరుడు కావాలనుకునే టైపు. తల్లిదండ్రులు (అలీ, రజిత)వాడికి ఎంత నచ్చ చెప్పినా చెవికెక్కించుకోడు. ఈ క్రమంలో అతడు దీపు (సుష్మిత శెట్టి) అనే డబ్బున్న అమ్మాయి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆమె దగ్గర రూ. 10 లక్షలు అత్యవసరం అని డబ్బు తీసుకొని క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న దీపు తండ్రి (రఘుబాబు) తన బిడ్డ దగ్గర నుంచి తీసుకున్న 10 లచ్చలు కట్టమని చెబుతాడు. కట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరిస్తాడు. పోయిన రూ. 10 లక్షల కోసం ఈశ్వర్ ఏం చేశాడు.. ? చివరకు తనకున్న సమస్యల వలయం నుంచి ఎలా బయటపడ్డాడనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

అల్లరి చిల్లరిగా చదవుకు అబ్బని కుర్రాడు. అతడి ప్రేమలో పడే అమ్మాయి.. అతన్ని నమ్మి కొన్ని డబ్బులు ఇవ్వడం.. బెట్టింగ్‌లో దాన్ని పోగోట్టుకున్న హీరో.. హీరోయిన్ తండ్రి తన డబ్బు తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయని చెప్పడం.. ఈ క్రమంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఎన్నో సినిమాల్లో అరిగిపోయిన రికార్డే. ఇలాంటి రొటిన్ స్టోరీలను ప్రేక్షకులు ఆకట్టుకునే స్క్రీన్‌ ప్లే‌తోనైనా మెప్పించాలి కదా. దర్శకుడు ఈ విషయంలో రొడ్డ కొట్టుడు స్టోరీ చుట్టి పడేశాడు. ఒక దాని తర్వాత మరొకటి ప్రేక్షకులకు ఊహకు అందేలా సాగడం రొటీన్ అనిపిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో మన దర్శక, నిర్మాతలు మొత్తంగా ఏడెమిది కథలనే అటు ఇటు తిప్పి తెరకెక్కిస్తున్నారు. అందులో సినిమాను ఎంత బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పారనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు నిరాశ పరిచాడు. క్రైమ్ కామెడీని ఏ మాత్రం ఆకట్టుకోలేని పేలమైన స్క్రీన్ ప్లే‌తో నీరసం తెప్పించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ఓకే కానీ.. దాన్ని చెప్పిన విధానం బాగాలేదు. కామెడీ కోసం ‘గే’ పాత్రను వాడుకోవడం.. డబుల్ మీనింగ్ డైలాగులను నమ్ముకోవడం రొటీన్ అనిపిస్తుంది. మొత్తంగా ఓల్డ్ సూపర్ హిట్ సినిమాల్లోని కొన్ని సీన్స్‌ను తీసుకొని అల్లుకున్నాడు. అన్న ప్రాసన రోజే ఆవకాయ అన్నం తిన్నట్టు మాములు కామెడీ హీరో తనకు తాను ఎక్కువ ఊహించుకొని మాస్ హీరో రేంజ్‌లో ఎలివేషన్స్ రాసుకోవడం బాగాలేదు. ఈ సినిమాలో పాటలు అసలు బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై మంచి శ్రద్ద పెడితే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువులు బాగున్నాయి. ఎడిటింగ్, స్రీన్ ప్లే  పెద్ద మైనస్.


నటీనటుల విషయానికొస్తే..

మౌళి తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. మాస్ హీరోగా చేసిన సీన్స్ అతిగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్‌లో నాచురల్‌గా ఒదిగిపోయాడు. ఇలాంటి తరహా కథలనే మంచి దర్శకులను నమ్ముకుంటే ప్రామిసింగ్ హీరోగా నిలదొక్కుకున్నట్టే. హీరోయిన్ సుష్మితా శెట్టి ఎందుకు పెట్టారో అసలు తెలియదు. అలీ, రజిత తల్లిదండ్రుల పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులకు పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

లాక్కొచ్చే ప్రయత్నం బాగానే చేశాడు కానీ క్యారెక్టరైజేషన్ లో ఆ నాచురాలిటీ మిస్ అవ్వడంతో అంతగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ సుష్మిత శెట్టి పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, నటన కూడా ఆకట్టుకునేలా లేదు. భద్రం ఒక వెరైటీ కామెడీ విలన్ రోల్ లో కనిపించినా అతనికి ఆ పాత్ర సెట్ కాలేదు. రఘుబాబు, అలీ, రజిత, ప్రియ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా వాళ్ళ పాత్రలు కూడా రొటీన్ గానే సాగుతాయి. స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఆర్టిస్ట్ లౌడ్ గా కనిపించారు.


బ్యాటమ్ లైన్: DNK బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ..

రేటింగ్: 2.25/5
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie