• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ఆడాళ్ల కాలేజీలో ఒకే ఒక్క కుర్రాడు.. ‘హైకూ’ మూవీ ఎలా ఉందంటే..

ఆడాళ్ల కాలేజీలో ఒకే ఒక్క కుర్రాడు.. ‘హైకూ’ మూవీ ఎలా ఉందంటే..

Haiku movie Review: ‘హైకూ’ టైటిల్‌‌తో పాటు టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఆడవాళ్లకు సంబంధించిన కాలేజీలో ఒక మగ పిల్లాడు చేరడం.. అతన్ని అక్కడి ఆడవాళ్లు ర్యాగింగ్ చేయడం అనే అంశంతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉందా లేదా మన మూవీ రివ్యలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 22, 2026, 05:56 PM IST|Updated: Oct 23, 2026, 11:04 AM IST
joinshare
ఆడాళ్ల కాలేజీలో ఒకే ఒక్క కుర్రాడు.. ‘హైకూ’ మూవీ ఎలా ఉందంటే..
Image Credit: Haiku Movie Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YS Jagan:  ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా  వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

2

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అడ్మిషన్ల గడువు పొడిగించాలి.. వైస్ ఛాన్సలర్‌కు విద్యార్థుల విజ్ఞప్తి..!!

3

Para Asian Games: పారా ఆసియా గేమ్స్‌లో భారత్ సరికొత్త రికార్డు.. తొలిసారి 100కి పైగా పతకాల కైవసం!

4

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 75శాతం మార్కులు సాధించాల్సిందే.. ఆ సర్వీసులకు మాత్రం ఉచితం..!!

5

Haryana Monkey Attack: కోతిపై రూ. 51 వేల రికార్డు.. హర్యానా ఘటనపై జంతు ప్రేమికుల ఆగ్రహం.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

కోర్ట్ ఫేమ్ శ్రీదేవి, ఏగ‌న్‌,  ఫెమినా జార్జ్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం  ‘హైకూ’. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించింది.  రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో యువరాజ్ చిన్న స్వామి డైరెక్ట్ చేశారు. డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.  

కథ విషయానికొస్తే..

ఆడవాళ్లు మాత్రమే చదివే  కాలేజీలో అనుకోకుండా  సీటు వచ్చిన మనోహర్ (ఏగన్ ) ఆ కళాశాలతో జాయిన్ అవుతాడు. అక్కడ అతన్ని కాలేజీలో చదివే  ఇతర అమ్మాయిలు ర్యాంగింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆ కాలేజీలో ఉండే జాబిలి (కోర్టు ఫేమ్ శ్రీదేవి)తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మొగ్గ తొడుగుతుంది. ఈ క్రమంలో జాబిలి.. మనో అలియాస్ మనోహర్‌కు బ్రేకప్ చెబుతుంది. ఆమె మరిచిపోలేక ఆమెను తలుచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో మనోహర్ మేనేజర్‌గా పనిచేసే కంపెనీలో అప్రెంటీస్‌గా చేరిన నివేదా (ఫెమినా జార్జ్) తో మెల్లిగా మాటలు కలుపుతాడు. ఆ వర్క్ రిలేషన్ కాస్తా ప్రేమగా మారుతుంది. ఇక నివేదాకు కూడా గతంలో తన బాయ్ ఫ్రెండ్‌తో తెగతెంపులు చేసుకుంటుంది. దాన్ని మరిచిపోలేక మనోహర్‌తో లవ్‌ను కంటిన్యూ చేయలేక ఆ బంధానికి బ్రేకప్ చెబుతుంది.

అసలు గర్ల్స్ చదివే కాలేజీలో మనోహర్ ఒక్కడే ఎందుకు స్టూడెంట్ చేరాల్సి వచ్చింది. అసలు జాబిలి,మనోహర్ ప్రేమకు ఎందుకు నో చెప్పింది. ఆమెతో బ్రేకప్‌ తర్వాత మనో, నివేదా ప్రేమ ఎందుకు ముందుకు సాగలేదు. అసలు మనో జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనేదే ‘హైకూ’ మూవీ స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ముఖ్యంగా ప్రేమ విఫలమైన ఇద్దరు ఆడ, మగ ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. వీళ్లిద్దరు తమ పాత ప్రేమ జ్ఞాపకాలను మరిచిపోకుండా వారిని వెంటాడటం అనే ఎమోషనల్ పాయింట్ పై ‘హైకూ’ కథను రాసుకున్నాడు దర్శకుడు యువరాజ్ చిన్నస్వామి. మొత్తంగా ఇలాంటి కథలు గతంలోనే చాలానే వచ్చాయి. ముఖ్యంగా రిలేషన్ షిప్‌లోని సాదకబాదకాలను చూపించిన విధానం కొత్తగా ఉంది. 
ముఖ్యంగా ఫస్టాఫ్ కాలేజీలో మనోహర్, జాబిలిలా ప్రేమ. ఆ తర్వాత వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారన్న కాన్సెస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్‌తో ఎండ్ చేసి సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.

ఇక లవర్ పెట్టే హింస భరించలేక ప్రేమ పై విరక్తి పుట్టిన అమ్మాయిగా నివేదా క్యారెక్టర్ భావోద్వేగంగా మలిచిన విధానం బాగుంది. ఇద్దరు తర్వాత ప్రేమలో పడటం. ఆ తర్వాత గత ప్రేమికుడి తాలుకూ జ్ఞాపకాలు ఆమె వెంటాడటంతో మనోతో ప్రేమకు నో చెబుతుంది. ఆ తర్వాత ఈ ముగ్గురి జీవితాలను ఎలాంటి మలుపులు తీసుకున్నాయనే పాయింట్ తెరపై చూస్తేనే మజా వస్తుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్లతో చక్కటి నటన రాబట్టుకున్నాడు.

దర్శకుడు యువరాజ్ చిన్నస్వామి గర్ల్స్ కాలేజీలో మగ పిల్లాడు జాయిన్ అవ్వడమనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. సాధారణంగా ఆడవాళ్లు మాత్రమే చదివే కాలేజీలో మగవాళ్లను జాయిన్ చేసుకోరు. ఇది కో ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కాలేజి అయివుండాలి. ఓ కో ఎడ్యుకేషన్ కాలేజీలో కొన్నేళ్లుగా అబ్బాయిలు ఎందుకు  చేరడం లేదనే విషయంలో క్లారిటీ ఇస్తే బాగుండేది. సినిమాలో లవ్ బిల్డప్ కోసం ఈ సీన్ రాసుకున్నట్టు ఉంది.

టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు తాను అనుకున్న కథను నిజాయితీగా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది జెన్ జీ క్యాటగిరి లవ్ స్టోరీలో ఇదే కొత్త తరహా కథ.లవ్ స్టోరీని చూపిస్తూనే అందులోని కుటుంబ సంబంధాల్లోని  భావోద్వేగాలను మలిచిన ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరాల్సిందే.  సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. సిద్దూ కుమార్ ఆర్ఆర్, పాటలు సందర్బోచితంగా ఉన్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

శ్రీదేవి కోర్టు మూవీ తర్వాత మరోసారి లవర్ పాత్రలో మెరిచింది. ఈ సినిమాకు మూల స్తంభంగా నిలిచింది. మరో కథానాయిక ఫెమినా జార్జ్, ఏగెన్  యూత్ ఐకాన్ తరహా పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరు కూడా ఈ వయసులో తమ ఏజ్‌‌ను మించిన పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఫెమినా జార్జ్ ఈ చిత్రానికి బలమైన వెన్నుముకగా నిలిచారు. ఏగన్ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే నారీ నారీ నడుమ మురారి తరహా మెచ్చుర్డ్ నటన కనబరిచాడు. ఎమోషన్, కామెడీ సీన్స్‌లో ఇంకాస్త మెరుగవ్వాలి. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. ‘హైకూ’ న్యూ ఏజ్ జెన్‌జీ లవ్ స్టోరీ..

రేటింగ్: 3/5 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie