SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా..? బిగ్ అప్‌డేట్..?

Chiranjeevi - Odela Srikanth combination: చిరంజీవి ప్రస్తుతం ఒకటికి మూడు సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇప్పటికే విశ్వంభర, కాకా సినిమాలత తర్వాత శ్రీకాంత్ ఓదెలతో చిరు సినిమా చేస్తున్నట్టు గతేడాది ప్రకటించారు. ఇక ప్యారడైజ్ రిజల్ట్ తర్వాత ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా లేదా..? ఇపుడు మెగాభిమానులను వేధిస్తుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 04, 2026, 08:13 AM IST | Updated: Oct 04, 2026, 08:16 AM IST
Image Credit: Chiranjeevi - Srikanth odela Movie (ZEE News Telugu/Source)
Join

Is Chiranjeevi Odela Combination: గతేడాది చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేసన్‌  అనౌన్స్ అయింది. నాని స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. అయితే  ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఆన్‌లోనే ఉందా లేదంటే అటకెక్కిందా..? ఇండస్ట్రీలో దీని గురించి చర్చ బాగానే జరుగుతుంది.  కాకా తర్వాత చిరు ప్లాన్ ఏంటి..? కమిట్‌మెంట్ ప్రకారం ఓదెల సినిమా చేస్తారా లేదంటే ఓటీటీలో బిజీ కానున్నారా అనే ప్రశ్న ఫ్యాన్స్‌ను వేధిస్తోంది. ఇంతకీ నాని ప్రొడక్షన్‌లో చిరు - ఓదెల ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండే ఛాన్స్ ఉందా లేదా అనేది అభిమానులను మిలియన్ డాలర్స్ ప్రశ్నగా వేధిస్తోంది.

నాని నిర్మాతగా చిరు- ఓదెల మూవీ..

నాని నిర్మాతగా చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోను అనౌన్స్ చేసినప్పుడు మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.  పైగా పోస్టర్‌లోనే బ్లడ్ బాత్ చూపించాడు ఓదెల. అయితే ఈ మధ్యే విడుదలైన 'ది ప్యారడైజ్'కు మిక్స్‌డ్ రిజల్ట్ రావడంతో.. మెగా కాంపౌండ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై పునరాలోచనలు మొదలయ్యాయని చర్చ జరుగుతోంది. అప్పట్లో మారుతితో సినిమా చేస్తానని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాడు. ఇక పూరీ జగన్నాథ్‌తో 150వ సినిమా చేస్తానని కమిట్‌మెంట్ ఇచ్చి  ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చేశారు. ఇలా మాట ఇచ్చి ఆ తర్వాత డైరెక్టర్ ట్రాక్‌తో పాటు కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం చిరంజీవి హిస్టరీలో లేదు.  ప్రస్తుతానికి ‘ప్యారడైజ్’ రిజల్ట్‌తో ఓదెల ప్రాజెక్ట్‌ను  హోల్డ్‌లో ఉందనే ప్రచారమే నడుస్తుంది.

ప్యారడైజ్‌కు మిక్స్‌డ్ రిజల్ట్‌తో శ్రీకాంత్ ఓదెల కెరీర్ డోలాయమానం..

‘దసరా’ తర్వాత ఓదెల కెరీర్ గ్రాఫ్ మరింత వేగంగా పైకి వెళుతుందని చాలామంది భావించారు.కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. ‘ది ప్యారడైజ్’ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సినిమా నిరాశపరిచినప్పుడు దాని ప్రభావం దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌లపై పడటం సహజమే. ఇప్పుడు అదే పరిస్థితి ఓదెలకు కూడా ఎదురవుతోందనే టాక్ వినిపిస్తోంది.

చిరుతో యాక్షన్ డోస్ పీక్స్..

శ్రీకాంత్ ఓదెల సినిమా అంటేనే యాక్షన్ డోస్ పీక్స్‌లో ఉంటుంది. అది దసరా అయినా.. ప్యారడైజ్ అయినా.. సినిమా కోసం హీరోలను ఫిజికల్‌గా చాలా కష్టపెడతారనే టాక్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి భారీ  యాక్షన్ సినిమాకి చిరు ఓకే చెబుతారా..? ప్రస్తుతం తన ఏజ్ దృష్ట్యా ఇలాంటి ప్రయోగాలకు చిరు అంత ఈజీగా ఒప్పుకోరనే టాక్ నడుస్తోంది.  ఈ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడటానికి ఇది కూడా ఓ ముఖ్య కారణమనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం చిరు ఫోకస్ అంతా ‘కాకా’ సినిమాపైనే ఉంది.

శ్రీకాంత్ ఓదెల టాలెంట్‌...
సుకుమార్ శిష్యుడిగా డైరెక్టర్‌గా శ్రీకాంత్ ఓదెల టాలెంట్‌పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఈ గ్యాప్‌లో ఓ హిట్ కొడితేనే మెగాస్టార్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ‘కాకా’ తర్వాత చిరు ఓటిటిలో టాక్ షో చేయబోతున్నారు. అప్పటి వరకు ఓదెలకు మెగా వెయిటింగ్ తప్పదు. మరి భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES