Boy dies after Biscuit gets stuck in throat in Mahbubnagar: సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలుంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న రెప్పపాటులో ఊహించని విషాదాలు చోటు చేసుకుంటాయి. ఇటీవల కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చేతిలో ఏదైన తినే పదార్థాలు ఇచ్చేసి వారు ఇతర పనులలో బిజీగా ఉంటారు. కొంత మంది ఫోన్ లలో రీల్స్ చేస్తు బిజీగా ఉంటారు.
అదే విధంగా మనంచిన్న పిల్లలకు ఆడుకొవడానికి ఏమిచ్చామో అన్నదికూడా చాలా ముఖ్యం. వారికి తెలియకుండా నోటిలో పెట్టుకుని అదికాస్త గొంతులో ఇరుక్కుంటే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయి. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకల్ మండలంలో పెనువిషాదం చోటు చేసుకుంది. సుర్తి తండాకు
చెందిన మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో వీరికి తల్లి మౌనిక బిస్కెట్లు ఇచ్చి వంట చేసేందుకు ఇంట్లోకి వెళ్లంది. అయితే.. వీరిలో ఒక చిన్నారి బిస్కెట్ తినగా.. గొంతులో చిక్కుకొంది. పాపం అతను ఊపిరి ఆడక ఇబ్బంది పడి కుప్పకూలిపోయాడు.
కాసేటికి అక్కడకు వచ్చిచూసిన తల్లి వెంటనే తన బిడ్డను తీసుకుని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న ఏడాది చిన్నారి మృతి చెందడంతో.. కుటుంబం, తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.