మూవీ రివ్యూ: ఇట్లు అర్జున (Itlu Arjuna)
నటీనటులు: అనీష్ రెడ్డి, అనస్వర రాజన్, వెన్నెల కిషోర్ ముఖేష్ రిషి, కలైయరసన్, ఇలంగో కుమరవేల్, తదితరులు
ఎడిటింగ్: కోటి కె
సినిమాటోగ్రఫర్: రాజా మహాదేవన్
సంగీతం: తమన్
సమర్పణ: నాగార్జున అక్కినేని
నిర్మాత: వెంకీ కుడుముల (వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్)
దర్శకత్వం: మహేష్ ఉప్పల
విడుదల తేది: 13-1-2026
నాగార్జున సమర్పణ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు అండ.. టీమిండియా క్రికెటర్స్ నుంచి మెసేజెస్.. వీటితోనే 'ఇట్లు అర్జున' సినిమాపై ప్రేక్షకుల్లో ఓ అటెన్షన్ క్రియేట్ చేశాయి. మహేష్ ఉప్పల దర్శకత్వం.. క్రేజీ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమాతో అనీష్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రిలీజ్ కు ముందే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం. ఆడియన్స్ మదిని దోచుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
అర్జున్ (అనీష్) పుట్టుకతోనే మాటలు రాని వ్యక్తి. తన తండ్రితో కలిసి చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తుంటాడు. దీంతో అతనికి పెద్దగా దోస్తులుండరు. చిన్న ఏజ్‌లోనే ఓ కేసులో జైలు శిక్ష పడుతుంది. మరోవైపు పెద్దన్న (ముఖేష్ రుషి)తన కుమారుడిని పెద్ద పొలిటిషన్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో వెయ్యి కోట్ల రూపాయిలను హవాలా మార్గంలో తెప్పించే ప్రయత్నంలో ఓ పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. ఈ డీల్‌కు సంబంధించిన వ్వవహారం మొత్తానికి సంబంధించిన డిజిటల్ కీ, పెన్ డ్రైవ్ వేరే వాళ్లకు చిక్కుతాయి. అదే సమయంలో పెద్దన్న కుమారుడు ముని హత్యకు గురవుతాడు. ఈ క్రమంలో హవాలా మార్గంలో రావాల్సిన రూ. 1000 కోట్లు అతని చేతికి చిక్కాయా..? తన కుమారుడు హత్య వెనక ఉన్నది ఎవరనే విషయాన్ని కనుగొన్నాడా..? ఈ క్రమంలో కీర్తి (అనస్వర రాజన్) ఎవరు..? కీర్తికి అర్జున్‌కు మధ్య పరిచయం ఎలా ఏర్పడింది. వీళ్లిద్దరి ప్రేమకు ఈ హవాలా డబ్బుకు ఉన్న లింక్ ఏమిటినేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
హీరోకు ఒక వైకల్యం ఉండటం.. దాన్ని అధిగమించి హీరో చేసే సాహసాల నేపథ్యంలో తెలుగు సహా గతంలో ఎన్నో చిత్రాలొచ్చాయి. అలాంటి పాయింట్ తోనే దర్శకుడు హరీష్ ఈ కథను రాసుకున్నాడు. హీరోకు మాటలు రావడం అనేది తప్పిస్తే మిగతాదంతా కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించాడు దర్శకుడు. మొత్తంగా రూ. 1000 కోట్ల హవాలా డబ్బు.. హీరో దొంగ కావడం.. అందులో సస్పెన్స్, కామెడీ, యాక్షన్ కలబోతగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అంతేకాదు ఈ సినిమా మేకింగ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కొత్త కుర్రాడితో ఇలాంటి కథతో సాహసం చేసినా.. ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్‌తో నడిపించాడు. అయితే అన్ని సరిగా ఉన్నవాళ్లతోనే అమ్మాయిలు అంతగా పడరు. ఇందులో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ఎలా ఏర్పడిందనే విషయాన్ని కాస్త క్లారిటీగా చెబితే బాగేండేది. మరోవైపు వెయ్యి కోట్ల కు సంబంధించి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఇంటర్వెల్ ముందు హీరో, హీరోయిన్స్ పెద్ద ప్రమాదంలో పడటం.. అక్కడ నుంచి సెకండాఫ్‌లో ఎలా బయటపడారనే ఎపిసోడ్ ఎంగేజ్ చేస్తుంది.
హీరో మూగవాడు కావడం అనేది ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఒక్క పాయింట్ మినహాయిస్తే మిగిలిన స్టోరీ లైన్ అంతా రెగ్యులర్ గానే అనిపించినా, దాన్ని తెరపై ప్రదర్శించిన విధానం మాత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది. 1000 కోట్ల రూపాయల చుట్టూ అల్లిన డ్రామా, ఆ పాస్ వర్డ్ కోసం జరిగే వేట ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు తోడుగా హాస్యాన్ని కూడా దర్శకుడు చాలా బ్యాలెన్స్డ్ గా మిక్స్ చేశాడు. ఎక్కడా కూడా చూసే వాళ్లకు విసుగు రాకుండా చాలా స్టైలిష్ మేకింగ్ తో మహేష్ ఉప్పల తన టాలెంట్ చూపించాడు. సినిమా ఫస్టాఫ్ అంతా ఎక్కువగా హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ మీదే నడుస్తుంది. దానికి సమాంతరంగా విలన్ గ్యాంగ్ డబ్బు కోసం చేసే అన్వేషణ క్యూరియాసిటీని పెంచుతుంది. మధ్యలో వెన్నెల కిషోర్, రఘుబాబు తనదైన టైమింగ్ తో నవ్వులు పూయిస్తాడు. లవ్ స్టోరీ చాలా ఆహ్లాదకరంగా, కొత్తగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ సమయానికి ప్రధాన జంట ఒక ఊహించని ప్రమాదంలో పడటం, అక్కడి నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు అనే ఉత్కంఠను క్రియేట్ చేస్తూ సెకండాఫ్ మీద క్యూరియాసిటీ పెంచుతారు. సినిమా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ను దర్శకుడు బాగా డిజైన్ చేసాడు. రూ. 1000 కోట్ల ఎపిసోడ్ దాన్ని సీక్వెల్ లో చూపించబోతున్నట్టు చెప్పడం ఒకింత నిరాశకు గురి చేస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది. హీరో లోపాన్ని ఆయుధంగా మలుచుకొని సినిమా క్లైమాక్స్ ను ప్లాన్ చేసిన విధానం చూస్తేనే మజా వస్తుంది. ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. సినిమాగా మరీ గొప్పగా లేకపోయినా.. ఉన్నంతలో బాగుంది. పెట్టిన డబ్బులకు న్యాయం చేసేలా సినిమా ఉంది.
థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే సినిమా మరో లెవల్లో ఉండేది. డైలాగులు బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెంట్ ఫ్యామిలీస్‌తో కలిసి ఈ సినిమా చూడొచ్చు.
నటీనటుల విషయానికొస్తే..
ఫస్ట్ మూవీ అయినా.. అనీష్ రెడ్డి ఎంతో అనుభనవం ఉన్న నటుడిగా రాణించాడు. ప్రతి సీన్‌లను కాన్పిడెంట్‌గా నటించారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా డాన్సు, యాక్షన్, కామెడీ సీన్లలో మెప్పించాడు. మూగవాడి క్యారెక్టర్ కాబట్టి అతని డైలాగ్ డెలవరి ఎలా ఉంటుందనేది తెలియాంటే నెక్ట్ మూవీ వరకు వెయిట్ చేయాల్సిందే. అనస్వర రాజన్ తన క్యూట్ లుక్స్‌తో మెస్మరైజ్ చసింది. వెన్నెల కిషోర్, రఘుబాబులు మరోసారి కామెడీ బాంబులు పేల్చారు. ముఖేష్ రుషి, బ్రహ్మాజీ మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘ఇట్లు అర్జున’.. మెప్పించే యాక్షన్ కామెడీ డ్రామా..
రేటింగ్: 3.25/5