• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /రజినీకాంత్ ‘జైలర్ 2’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. తలైవా ఖాతాలో ఎన్నో రికార్డులు..

రజినీకాంత్ ‘జైలర్ 2’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. తలైవా ఖాతాలో ఎన్నో రికార్డులు..

Jailer 2 4 Days Box Office Collection: సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్‌తో దూసుపోతుంది. విడుదల ముందు వరకు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా మౌత్ టాక్‌తో ఒక్కసారిగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు ఈ వీకెండ్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 05:29 AM IST|Updated: Oct 19, 2026, 05:30 AM IST
joinshare
రజినీకాంత్ ‘జైలర్ 2’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. తలైవా ఖాతాలో ఎన్నో రికార్డులు..
Image Credit: Jailer 2 4 Days Box Office Collections (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మమిత బైజు తెలుగు ఎంట్రీకి అంతా సిద్ధం.. ? ఏ సినిమాతో అంటే.. !!

మమిత బైజు తెలుగు ఎంట్రీకి అంతా సిద్ధం.. ? ఏ సినిమాతో అంటే.. !!

2

తమన్నా బోల్డ్ స్టెప్.. కెరీర్ కోసం ఆ మాత్రం ఉండాలంటున్న మిల్కీ బ్యూటీ..

3

రజినీకాంత్ ‘జైలర్ 2’ 4 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. తలైవా ఖాతాలో ఎన్నో రికార్డులు..

4

2026 చివరి రెండు నెలల్లో బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్న యంగ్ హీరోస్..

5

Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పులు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajinikanth Jailer 2 4 Days Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ ఏజ్  76 దగ్గరపడుతున్నా.. యంగ్  హీరోలకు మించి బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తున్నారు. అంతేకాదు తన వయసుకు తగ్గట్టు ఎలాంటి హీరోయిన్స్‌తో చిందులేయకుండా..బాక్సాఫీస్ తుక్కు రేగొడుతున్నట్టు తెలుస్తుంది. ‘జైలర్ 2’ సినిమాను కూడా జైలర్ సినిమాకు  కంటిన్యూగా చూసిస్తూ ఆ తర్వాత ఏం జరిగిందనే కాన్సెస్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమా రజినీకాంత్ సొంత రాష్ట్రం తమిళనాడుతో పాటు ఓవర్సీస్‌ మార్కెట్‌లో తుక్కు రేగొడుతుంది.

మొత్తంగా జైలర్ 2 సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 63.50 కోట్ల గ్రాస్ (రూ. 129 కోట్ల గ్రాస్), రెండు రోజు రూ. 40.45 కోట్ల షేర్ (రూ. .30.82 కోట్ల గ్రాస్), మూడో రోజు రూ. 52.65 కోట్ల వసూళ్లను సాధించింది. అంతేకాదు మూడో రోజు రూ. 52.65 కోట్ల షేర్ (రూ.110.45 కోట్ల గ్రాస్), నాల్గో రోజు ఈ సినిమా రూ. 50  కోట్ల షేర్ నుంచి 55 కోట్ల షేర్(రూ. 108 కోట్ల గ్రాస్ ) వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 కోట్ల షేర్ (రూ. 40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా తమిళనాడులో రూ. 110 కోట్లు గ్రాస్.. ఓవర్సీస్‌లో రూ. 180 కోట్ల గ్రాస్.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్ల గ్రాస్.. కర్ణాటకలో రూ. 40 కోట్ల గ్రాస్.. కేరళలో రూ. 37 కోట్ల గ్రాస్.. హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ లో రూ. 20 కోట్ల గ్రాస్.. రాబట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 428 కోట్ల గ్రాస్ (రూ. 207 కోట్ల షేర్) రాబట్టింది.

రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టిన రజినీకాంత్ మూడో చిత్రం..

మొత్తంగా రజినీకాంత్ కెరీర్‌లో ఫస్ట్ డే రూ. 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్  రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. గతంలో 2.O, కూలీ.. తాజాగా ‘జైలర్ 2’ సినిమాలు మొదటి రోజు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ అత్యధికంగా 9 సినిమాలు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అగ్ర స్థానంలో నిలిచారు. ఆ రికార్డును రజినీకాంత్ సమం చేశారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన 7 చిత్రాలు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాలు రాబట్టాయి. అంతేకాదు ఫాస్టెస్ట్ రూ. 200 కోట్ల గ్రాస్.. రూ. 300 కోట్లు గ్రాస్..రూ. 400 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన తమిళ సినిమాగా రికార్డులు క్రియేట్ చేశాయి.

రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో రజినీకాంత్ 4 చిత్రాలు.. 
ఇక మూడు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాలు రజినీకాంత్ కెరీర్‌లో నాలుగున్నాయి. అత్యధికంగా ప్రభాస్ కెరీర్‌లో 6 చిత్రాలున్నాయి. విజయ్ కెరీర్‌లో 5 చిత్రాలున్నాయి. ఎన్టీఆర్ కు మూడు చిత్రాలు రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించాయి.

నాలుగు వందల కోట్ల క్లబ్బులో రజినీకాంత్ ‘జైలర్ 2’..

ఇక నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ప్రభాస్‌కు 5 చిత్రాలున్నాయి. విజయ్‌కు 2 చిత్రాలున్నాయి. రజినీకాంత్ కెరీర్‌లో 2.O, జైలర్, కూలీ, తాజాగా జైలర్ 2 చిత్రాలు రూ. 400 కోట్ల గ్రాస్ క్లబ్బులోప్రవేశించాయి.

జైలర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘జైలర్ 2’ మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్’ మూవీ ఎక్కడా ఎండ్ అయిందో అక్కడ మొదలుపెట్టాడు. సీక్వెల్‌కు సంబంధంచిన స్టోరీని ఎంతో ఒళ్లు దగ్గర పెట్టుకొని  బాగానే వర్కౌట్ చేసాడు. పైగా సీనియర్ బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రబర్తి మెయిన్ విలన్‌గా చక్రాల కుర్చీకే పరిమితమైన పాత్రలో తన పాత్రలో ఒదిగిపోయాడు.. ఇక  విద్యాబాలన్ కూడా లేడీ విలన్‌గా రజినీకి నటనలో గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. ఇక  ఎస్.జే.సూర్య, సూరజ్ వెంజమూడు విలనిజం పండింది. ఇక మోహన్‌ లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, జాకీష్రాఫ్‌ల క్యామియోలు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.  

‘జైలర్ 2’ మూవీ  ప్రీ రిలీజ్ బిజినెస్.. 
మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలో రూ. 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ప్రపంచ వ్యాప్తంగా తమిళనాడు - రూ. 125 కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్లు.. కర్ణాటకలో రూ. 26 కోట్లు.. కేరళ + రెస్ట్ ఆఫ్ భారత్ -రూ. 30 కోట్లు.. ఓవర్సీస్ -రూ. 80 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ. 302 కోట్ల షేర్ రాబట్టాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 304 కోట్ల షేర్ (రూ. 600 కోట్ల గ్రాస్) రాబట్టాల్సిన అవసరం ఉంది. వరుసగా దసరా సెలవుల నేపథ్యంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం నల్లేరు మీద నడకే అని చెప్పాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie