SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘జైలర్ 2’తో రజినీకాంత్ ఆ ఫీట్ అందుకుంటాడా..!! తమిళ సినిమా పరువు తలైవా చేతుల్లోనే.

Jailer 2 Rajinikanth New Industry Record: రజినీకాంత్ అసలుసిసలు బాక్సాఫీస్ సూపర్ స్టార్‌గా నిలిచారు. చొక్కా నలక్కుండా కేవలం తన నటన, స్వాగ్‌తో ‘జైలర్ 2’ మూవీ అంచనాలను మించి వసూళ్లను సాధిస్తోంది. తాజాగా తమిళ సినీ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచిన ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశిస్తుందా.. మొత్తంగా తమిళ సినిమాకు అందని ద్రాక్షలాగా ఉన్న రూ. 1000 కోట్ల వసూళ్లను ఈ సినిమా అధిగమిస్తుందా ?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 27, 2026, 02:05 PM IST | Updated: Oct 27, 2026, 02:10 PM IST
Image Credit: Jailer 2 (X/Source)
Join

Jailer 2 Will Cross 1000 Crore: సూపర్ స్టార్ రజినీకాంత్ 75 వయసులో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. మన దేశంలో ఈ వయసులో ఈ రేంజ్‌లో చొక్కా నలగకుండా  ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక హీరో రజినీకాంత్. ఇక సినీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ గా పరగణించే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఏ నటుడు ఈ రేంజ్‌లో హిట్ కొట్టలేదు. మొత్తంగా ‘జైలర్ 2’ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీ కొత్త రికార్డులు వెతుక్కుంటోంది. ఈ సినిమా 12 రోజుల్లో దాదాపు రూ. 715 కోట్ల గ్రాస్ వసూళ్లను  సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

జైలర్ 2 ఇండస్ట్రీ హిట్..

గతంలో రజినీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘2.O’ సినిమా నెగిటివ్ టాక్‌తో కూడా దాదాపు రూ. 710 కోట్లను వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దాదాపు 8 యేళ్ల వరకు ఈ సినిమా రికార్డును ఏ చిత్రం టచ్ చేయలేకపోయింది. తాజాగా రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్ 2’ మూవీ ఇపుడా రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమా టోటల్‌ రన్‌లో రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశిస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు తమిళంలో ఏ చిత్రం రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించలేదు.

రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో జైలర్ 2 ?

ఇప్పటి వరకు మన దేశంలో తొలిసారి బాహుబలి 2 రూ. వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత దంగల్, జవాన్, పఠాన్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్,  కల్కి 2898 ఏడీ,  పుష్ప 2, దురంధర్, దురంధర్ 2 చిత్రాలు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి. ఇక ఓ సినిమా రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాలంటే హిందీ మార్కెట్ అనేది అత్యంత కీలకం. హిందీ ప్రేక్షకులు చూస్తేనే ఏ సినిమా అయినా.. వెయ్యి కోట్లు క్రాస్ చేసేది. ‘జైలర్ 2’ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో ఇరగదీస్తోన్న కీలకమైన హిందీ భాషల్లో పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఈ సినిమా ఫైనల్ రన్‌లో రూ. 850 కోట్ల గ్రాస్ వసూళ్లకే పరిమితం కానున్నట్టు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్న మాట.

హిందీ కలెక్షన్స్.. 

ఇకపై తమిళంలో తెరకెక్కించే ఏ చిత్రమైనా ప్యాన్ ఇండియా ప్రేక్షకులు అంటే హిందీ ప్రేక్షకుల ఆదరిస్తేనే ఆ సినిమా రూ. వెయ్యి కోట్లు క్రాస్ చేస్తుంది. కేవలం రీజనల్ లాంగ్వేజ్‌లను నమ్ముకుంటే రూ. 1000 కోట్లు దాటడం ఇంపాజిబుల్. ఏది ఏదైనా ‘జైలర్ 2’  ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం కాదు. తెలుగు, కన్నడ,తమిళం, మలయాళం ఇండస్ట్రీలో ఉన్న  ఏ సీనియర్ స్టార్ హీరో కూడా  రజినీకాంత్ దరిదాపుల్లో లేరనే విషయం అర్థమవుతుంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES