‘జైలర్ 2’ ప్రీ రివ్యూ.. తలైవా ఫ్యాన్స్ లుంగీ డాన్స్..
Jailer 2 First Review: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. మరోసారి థియేటర్లలో తనదైన స్టైల్‌తో సందడి చేసేందుకు వస్తున్నారు తలైవా. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘జైలర్ 2’ మరికొన్ని గంటల్లో అంటే రేపు (అక్టోబర్ 15)న ప్రేక్షక దేవుళ్ల ముందుకు రాబోతోంది.
Rajinikanth Another Hit: 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి ఈసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ ఎలాంటి మిషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకతల విషయానికొస్తే..
రజనీకాంత్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఇదే ఆయనకు కోట్లాది మంది అభిమానులు అయ్యేలా చేసింది. ‘జైలర్ 2’లో కూడా టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు క్రిమినల్ వరల్డ్‌కు సంబంధించిన ప్రమాదకరమైన పరిణామాలు ఈ కథలో కీలకంగా ఉండనున్నాయి.
ఇక డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ గురించి చెప్పాలంటే..
కామెడీని, యాక్షన్‌ను కలిపి కథను ఆసక్తికరంగా చెప్పడంలో నెల్సన్ తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మొదటి భాగంలో వర్కౌట్ అయిన ఈ ఫార్ములాను సీక్వెల్లో ఎలా ముందుకు తీసుకెళ్లారన్నది ఇంట్రెస్టింగ్ బ్లాంక్ పాయింట్. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే, ట్విస్టులు, హీరో ఎలివేషన్స్ సినిమాకు కీలకం కానున్నాయి.
స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ..!
రజనీకాంత్‌తో పాటు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషణ్, విద్యాబాలన్, ఎస్.జే. సూర్య వంటి నటులు ఉండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది. వీరి పాత్రలు కథలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది సినిమా చూసిన తర్వాతే క్లారిటీ రానుంది.
ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ‘జైలర్’ సినిమా థియేటర్స్‌లో అంత పెద్ద హిట్ కావడానికి ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలకంగా నిలిచింది. ఈ సినిమాకు యాక్షన్ సన్నివేశాలకు ఆయన సంగీతం తోడైతే థియేటర్లలో అభిమానుల సందడి మరో స్థాయిలో ఉండే అవకాశం ఉంది.
మరి బాక్సాఫీస్ దగ్గర ‘జైలర్ 2’ పరిస్థితి ఎలా ఉండబోతోంది?
రజనీకాంత్ క్రేజ్, మొదటి భాగం సక్సెస్, భారీ స్టార్ క్యాస్టింగ్.. ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా కనిపిస్తున్నాయి. అయితే కథలో కొత్తదనం, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఉండే గ్రిప్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయన్నదే అసలైన పరీక్ష. ఫస్ట్ పార్ట్ చివర్లో ధర్మం కోసం కొడుకును చంపే స్ట్రిక్ట్ ఆఫీసర్.. ఇక మిగతా దేశ ద్రోహులను ఎలా విడిచిపెడతానేది చూడాలి.
మొత్తానికి, ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ సినిమా నిజంగా బ్లాక్‌బస్టర్ అవుతుందా? మొదటి భాగాన్ని మించి ప్రేక్షకులను మెప్పిస్తుందా? అనే ప్రశ్నలకు థియేటర్లలో సినిమా చూసిన తర్వాతే సమాధానం దొరుకుతుంది.సో, తలైవా అభిమానులారా.. టైగర్ ముత్తువేల్ పాండియన్ మళ్లీ తన పవర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.