‘జైలర్ 2’ టికెట్ రేట్స్ హైక్స్.. తమిళనాడులో కంటే ఏపీ, తెలంగాణలోనే ఎక్కువ రేట్లు.. ఏంటి రాజా ఇది..!
Jailer 2 Ticket Rates hikes: ఓ వైపు ఓటీటీ, పైరసీ మరోవైపు భారీ టిక్కెట్ రేట్స్ కారణంగా థియేటర్స్ వైపు ప్రేక్షకులు చూడాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ వాళ్లను ఆకట్టుకోవాలంటే అందుబాటులో టికెట్ రేట్స్ ఉండాలి. కానీ ‘జైలర్2’ లాంటి డబ్బింగ్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచడం సరైన నిర్ణయమేనా..? దీని వల్ల అసలు పెద్దగా అంచనాలు లేని ‘జైలర్ 2’ మూవీ ఓపెనింగ్స్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది చూడాలి.
Jailer 2 ticket Rates Hike Effects: ప్రస్తుతం తెలుగు, తమిళం సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఓ సినిమా హిట్టై దానికి కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తే ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతారు. కానీ ‘జైలర్ 2’ విషయంలో అది రివర్స్ అవుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తర్వాత ఈ సినిమా పై పెద్దగా అంచనాలు లేవు. అదే రొడ్డ కొట్టుడు నరకడం మినహా మరేది లేదనేది సోషల్ మీడియాలో ఆడియన్స్ చెబుతున్న మాట. ఒకవేళ కంటెంట్ మొదటి పార్ట్ తరహాలో ఉంటే మాత్రం ఈ సినిమాను ఆపడం ఎవరి తరం కాదు. తాజాగా ‘జైలర్ 2’ మూవీని తమిళనాడులో ఎలాంటి హైక్స్ లేకుండా మాములుగా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్‌లో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రేక్షకులు టాకీస్ల వైపు అడుగులు వేయాలంటే టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. మరి ఇలాంటి సమయంలో జైలర్ 2 లాంటి డబ్బింగ్ సినిమాకు ఏపీలో రేట్లు పెంచడం సరైన నిర్ణయమేనా అనే ప్రశ్న కామన్ ఆడియన్స్‌లో మెదులుతుంది. ఈ మధ్య పెద్ద సినిమాలకు పెరిగిన రేట్లు మేలు కంటే చేటు ఎక్కువగా చేసాయి. అయినా మళ్లీ ఈ టికెట్ పెంపు ప్రయోగాలు ఎందుకు అని కామన్ ఆడియన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలో ఓ వర్గం వారు చెప్పుకుంటున్న మాట. ఇదే సమయంలో రెగ్యులర్ ప్రైస్‌తో వస్తున్న రణబాలికి ఇదెంత వరకు ప్లస్ కానుందనేది చూడాలి.
ఈ మధ్య రెగ్యులర్ టికెట్ రేట్లు ఉన్నపుడే ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్‌లో అక్టోబర్ 15న రాబోతున్న ‘జైలర్ 2’ సినిమాకు ఏపీలో రేట్లు పెంచడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రెగ్యులర్ ప్రైసింగ్‌తోనే వస్తున్న ఈ డబ్బింగ్ సినిమాకు.. ఏపీలో మాత్రం రేట్లు పెంచడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గతంలో ప్యారడైజ్, పెద్ది, టాక్సిక్ లాంటి భారీ సినిమాలకు ఈ రేట్ల పెంపు పెను శాపంగా మారింది. మరోవైపు తమిళనాడు కంటే తెలుగు రాష్ట్రంలోనే ‘జైలర్ 2’ రేట్లు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. డబ్బింగ్ సినిమాకు టికెట్ హైక్ ఎందుకనేదే ఇక్కడ అసలు ప్రశ్న. మరోవైపు రణబాలి రెగ్యులర్ టికెట్ రేట్లతోనే వస్తుంది.. తన కంట్రోల్‌లో ఉన్నంత వరకు ఇకపై తన సినిమాలకు రేట్లు పెరగవని విజయ్ దేవరకొండ కూడా చెప్పారు.
మొన్నటికి మొన్న రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ ఎలాంటి టికెట్ రేట్స్ పెంపు లేకపోవడం వల్లే రికార్డ్స్ ఓపెనింగ్స్ తో చరిత్ర తిరగరాసింది. ఎక్కువ ఫుట్ ఫాల్స్ దక్కాయి. దానికి ముందు చాలా సినిమాలు నార్మల్ రేట్లతోనే మెప్పించాయి. కాబట్టి జైలర్ 2 రేట్లు పెరగడం రణబాలికి అడ్వాంటేజ్‌గా మారే అవకాశం లేకపోలేదు. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. రణబాలి రప్ఫాడించడం ఖాయం. ఏదేమైనా టికెట్ రేట్ల పెంపుదలపై నిర్మాతలు మరోసారి ఆలోచించాల్సిందే. లేకపోతే మొదటికే మోసం రావచ్చు.