Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్.. ట్రైలర్‌లో వచ్చిన చివరి సెకండ్స్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం!
Jailer 2 Trailer: సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది. 2023లో విడుదలైన ‘జైలర్’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 5న విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
Jailer 2 Trailer: జైలర్ 2 సినిమాలో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. మొదటి సినిమాలో రిటైర్డ్ జైలర్‌గా కనిపించిన టైగర్.. విగ్రహాల అక్రమ రవాణా చేసే ముఠాను ఎదుర్కొన్నాడు. అయితే ఈసారి అతని గతం, శత్రువులు మరింత పెద్ద సమస్యగా మారినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
మొదటి భాగంలో తన పని పూర్తయిందని భావించిన టైగర్ ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. కానీ అతని చుట్టూ ఉన్న పరిస్థితులు మళ్లీ అతన్ని పోరాటంలోకి లాగుతాయి. పాత శత్రువులతో పాటు కొత్త వ్యక్తులు కూడా అతనికి ఎదురుగా నిలుస్తారు. ట్రైలర్‌లో టైగర్ ఒక మారుమూల గ్రామంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చూపించారు.
ఈసారి కథ మరింత పెద్ద స్థాయిలో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. అనేక మంది విలన్లు, పెద్ద క్రిమినల్ నెట్‌వర్క్, భారీ యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో కనిపించాయి. ముఖ్యంగా ఎస్.జే. సూర్య పాత్ర ఆసక్తిని పెంచుతోంది. ఆయన పాత్ర విలన్‌గా కనిపిస్తున్నప్పటికీ, అసలు ఉద్దేశం ఏమిటనేది సస్పెన్స్‌గా ఉంచారు.
మరో ప్రత్యేకత విద్యా బాలన్. ఆమె తొలిసారి తమిళ సినిమాలో నటిస్తున్నారు. ట్రైలర్‌లో ఆమెకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కనిపించినా, టైగర్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటనేది మాత్రం వెల్లడించలేదు. అలాగే మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటుల కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
రజినీకాంత్, యోగిబాబు మధ్య కామెడీ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. యాక్షన్‌తో పాటు కామెడీకి కూడా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం కూడా ట్రైలర్‌కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
2023లో వచ్చిన ‘జైలర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘జైలర్ 2’ అంతకంటే పెద్ద విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read More: Janhvi Kapoor: టాలీవుడ్‌లోకి అనవసరంగా వచ్చిన జాన్వీ కపూర్.. వరుస వివాదాలతో పెరుగుతున్న డ్యామేజ్!
Read More: ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?