SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మంచు మనోజ్ చేతులు మీదుగా ‘కాళాంకి భైరవుడు’ మూడు పాట విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

Kaalanki Bhairavdudu Third Single: పెద్ద హీరోలు చిన్న సినిమాలకు సపోర్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇక మంచు మనోజ్ కూడా కేవలం తన సినిమాలు మాత్రమే కాకుండా.. వేరే హీరోలు నటించిన సినిమాలకు తన వంతు ప్రమోషన్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ‘కాళాంకి భైరవుడు’ చిత్రానికి తన వంతు సాయం అందించారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 10:08 AM IST | Updated: Oct 29, 2026, 06:12 PM IST
Image Credit: Manchu Manoj (X/Source)
Join

Manchu Manoj Release Third Single: చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంలో తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం ‘కాళాంకి భైరవుడు’.  రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కొన్ని ఆశ్యర్యకరమైన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హరి హారన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. రితిక, పూజ కిరణ్, భవ్యశ్రీ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.

డీకొల్లు శ్రీధర్ సమర్పణలో  గాయత్రీ ప్రొడక్షన్స్, రాచమళ్ళ బ్రదర్స్ బ్యానర్లపై కె.ఎన్. రావు, డా. రాచమళ్ళ శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. పి.ఆర్. మ్యూజిక్ అందిస్తున్నారు.  అశోక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రం గతంలో తెలుగులో వచ్చిన కాశ్మోరా, అమ్మోరు, అరుంధతి తరహాలో పూర్తిగా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఉండనుంది. చివరకు దుష్ట శిక్షణ శిష్ణ రక్షణ అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. చెడు ఎంత ఉన్నా.. అంతిమంగా మంచి ఎలా జయిస్తుందనేది ఈ సినిమాలో చూపెట్టబోతున్నారు.

మంచు మనోజ్ విషయానికొస్తే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘మిరాయ్’ సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఆ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘దాదా’ సినిమాలో పవర్‌ఫుల్ ప్రతి నాయకుడిగా పాత్రలో కనిపించబోతున్నాడు. దీంతో పాటు హీరోగా పలు కీలక ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోగా పలు సినిమాల్లో నటిస్తూనే హీరోగా మురిపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు కొత్త నటీనటులకు సంబంధించిన కార్యక్రమాల్లో చేదొడు వాదొడుగా ఉంటున్నాడు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES