SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kajal Aggarwal Love Story: 14 ఏళ్ల క్రితమే ప్రేమ.. బ్రేకప్ తర్వాత మళ్లీ ఒక్కటైన జంట.. పెళ్లిపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Kajal Aggarwal Love Story: సినిమాల్లో ఎన్నో ప్రేమకథల్లో నటించిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిజ జీవిత ప్రేమకథ కూడా ఒక సినిమా కథను తలపిస్తోంది. ప్రేమ, విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం.. ఇలా ఎన్నో మలుపులు దాటిన తర్వాత ఆమె తన ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో పరిచయం, ప్రేమ, బ్రేకప్, పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీంతో ఆమె లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Written By Vishnu Priya
Published: Nov 14, 2026, 05:04 PM IST | Updated: Nov 14, 2026, 05:22 PM IST
Join

Kajal Aggarwal Love Story: కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు మధ్య పరిచయం ఇప్పటిది కాదు. దాదాపు 13 నుంచి 14 ఏళ్ల క్రితమే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట. అయితే అప్పట్లో కొన్ని పరిస్థితుల కారణంగా వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తమ జీవితాల్లో ముందుకు సాగుతూ వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ కూడా చేశారు. కానీ కాలం గడిచేకొద్దీ తమ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని ఇద్దరికీ అర్థమైంది.

ఈ విషయాన్ని కాజల్ తనదైన శైలిలో సరదాగా వివరించారు. "దాదాపు 13 లేదా 14 ఏళ్ల క్రితం మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ తర్వాత విడిపోయాం. మా జీవితాల్లో వేర్వేరు వ్యక్తులు వచ్చారు. వారితో డేటింగ్ కూడా చేశాం. కానీ చివరకు మేమిద్దరం మళ్లీ కలుసుకున్నాం" అని ఆమె చెప్పారు. వేరే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే ఒకరికొకరు ఎంత ముఖ్యమో అర్థమైందని కాజల్ అభిప్రాయపడ్డారు.

అయితే రెండోసారి గౌతమ్ తన జీవితంలోకి వచ్చినప్పుడు కాజల్ మాత్రం ఈసారి ఎలాంటి గందరగోళానికి తావివ్వకూడదని భావించారు. ప్రేమలో ఉన్నప్పటికీ భవిష్యత్తుపై స్పష్టత ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే గౌతమ్‌తో నేరుగా తన మనసులోని మాట చెప్పేశారు. "ఓకే బాస్.. ఈసారి మనం పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఒకరికొకరం గుడ్‌బై చెప్పుకోవాలి" అని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. కాజల్ పెట్టిన ఈ కండిషన్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.

గౌతమ్ కూడా పెళ్లికి సిద్ధంగా ఉండటంతో వీరి ప్రేమకథ పెళ్లి బంధంగా మారింది. 2020 అక్టోబర్ 30న ముంబైలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలోనే వీరి పెళ్లి జరిగింది.

2022 ఏప్రిల్‌లో కాజల్, గౌతమ్ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతడికి నీల్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే కాజల్ సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు.

Read More: Giribabu: టాలీవుడ్‌లో విషాదం.. సినీనటుడు గిరిబాబు కన్నుమూత..

Read More:Anirudh Kavya Maran Wedding: అనిరుధ్ - కావ్యా మారన్ పెళ్లికి ఖర్చు రూ.100 కోట్లా? సోషల్ మీడియాలో సంచలనం!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ZEENEWS TRENDING STORIES