• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

Kiara Advani Pregnant Again: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు మరోసారి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ స్టార్ కపుల్ త్వరలో తమ కుటుంబాన్ని మరింత పెంచుకోబోతున్నారు. కియారా మరోసారి తల్లి కాబోతున్న విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Written ByVishnu Priya
Published: Oct 07, 2026, 12:24 PM IST|Updated: Oct 07, 2026, 12:40 PM IST
joinshare
Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
KCR: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. అసలు కారణం ఇదేనా..?..

KCR: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. అసలు కారణం ఇదేనా..?..

2

DA Hike 2026: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. రెండు పెండింగ్ డీఏల విడుదలకు ఉత్తర్వులు జారీ

3

‘జైలర్ 2’ ఫస్ట్ రివ్యూ.. రజినీకాంత్ ఖాతాలో మరో హిట్ గ్యారంటీనా..

4

Mangalagiri Lodge Incident: ప్రమోషన్ వీడియో అని పిలిచి మంగళగిరిలో యువతిపై అత్యాచారం..రూ.14,000 దోపిడి!

5

Actress: ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kiara Advani Pregnant Again: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోతా 2023లో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు ‘షేర్షా’ సినిమా సమయంలోనే బీజం పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కొంతకాలం తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉన్న ఈ జంట చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2025 జూలైలో కియారా, సిద్ధార్థ్ దంపతులకు మొదటి సంతానం జన్మించింది. వీరికి పాప పుట్టింది. ఆ పాపకు సారాయా అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి కియారా తన మాతృత్వాన్ని ఎంతో ఆస్వాదిస్తోంది.

ఇప్పుడు మరోసారి తల్లి కాబోతున్న విషయాన్ని కియారా అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫొటోలో వారి కుమార్తె సారాయా తన చిన్న చేతిలో తెల్లటి సాక్స్ పట్టుకుని కనిపించింది. పాప చేతికి సిద్ధార్థ్, కియారా చేతులు అండగా ఉన్నాయి.

ఈ ఫొటోతో పాటు కియారా ఎంతో ఆనందంగా తమ కుటుంబంలోకి మరో చిన్నారి రాబోతున్న విషయాన్ని తెలిపింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా ఈ జంటకు అభినందనలు తెలిపారు.

తల్లి అయిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని కియారా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తల్లి కాకముందు ఉన్న వ్యక్తి కంటే ఇప్పుడు తాను పూర్తిగా భిన్నంగా ఉన్నానని తెలిపింది. మాతృత్వం తనకు కొత్త బలాన్ని ఇచ్చిందని కూడా చెప్పింది.

ప్రస్తుతం కియారా సినిమాలతో కూడా బిజీగా ఉంది. యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు రెండోసారి తల్లి కాబోతున్న వార్తతో కియారా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. అభిమానులు మాత్రం ఈ స్టార్ దంపతులకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read More: Archana Gautam Cafe Theft: బిగ్ బాస్ ఫెమ్ అర్చనా గౌతమ్ కేఫ్ లో భారీ చోరీ.. వీడియో రిలీజ్ చేసిన నటి.!.

Read More: Tamannaah Bhatia: ఇవాళ నా జీవితంలో అద్భుతం జరిగింది.. తిరుమలలో తమన్న భాటీయా భావోద్వేగం.. వీడియో..

Add Zee News as a Preferred Source
TAGS:
Bollywood