Bigg Boss 16 fame Archana Gautam Mumbai cafe robbed: బిగ్ బాస్ 16 ఫెమ్, మోడల్ అర్చనా గౌతమ్ కు చెందిన కేఫ్ లో దొంగలు పడ్డారు. ముంబైలో ఉన్న ఈ భామకు చెందిన కేఫ్ లో సోమవారం తెల్లవారుజామున ఒక ఆగంతకుడు ప్రవేశించాడు. నెమ్మదిగా కేఫ్ లోకి దూరి కౌంటర్ లో డబ్బులను చోరీ చేశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 24 న చోటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అర్చన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Archana Gautam के मुंबई स्थित कैफे “Oye Churros” में चोरी की खबर आज 6 अक्टूबर 2026 को सामने आई है। कैफे वर्सोवा, अंधेरी वेस्ट में है। CCTV में एक व्यक्ति कैफे में घुसकर पूरा कैश काउंटर उठाकर ले जाता हुआ दिखाई दे रहा है @CPMumbaiPolice @MumbaiPolice @archanagautamm #MumbaiNews https://t.co/0FufbCDfOv
— Delhi Complaint 🇮🇳 (@delhicomplaint1) October 6, 2026
ముంబైలోని తన కేఫ్‌లో ఒక ఆగంతకుడు ప్రవేశించాడని తెలిపారు. అదే విధంగా చాలా ఇష్టంతో, కష్టపడి నా సేవింగ్స్ తో ఈ కేఫ్‌ను నిర్మించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న వస్తువును దగ్గరుండి మరీ సమకూర్చుకున్నట్లు తెలిపారు. కానీ ఒక దొంగ కేఫ్‌లోకి చొరబడి మొత్తం క్యాష్ కౌంటర్‌నే ఎత్తుకెళ్లడం చాలా బాధగా ఉందన్నారు.
అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడున్న కూడా తమ వ్యాపారాలపై నిరంతరం ఒక దృష్టి పెట్టాలని కూడా చెప్పుకొచ్చారు. ముంబైని చాలా మంది సెఫ్ ప్లేస్ అంటారని, అలాంటిచోట చోరీ జరగడం చాలా షాక్ కు గురిచేసిందన్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు అర్చనా గౌతమ్ 2025 అక్టోబర్‌లో ఈ కేఫ్‌ను ప్రారంభించి ఫుడ్ బిజినెస్‌లో ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఆమె "సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ ఇండియా" షోలో పాల్గొన్నారు. అదే విధంగా.. ‘బిగ్ బాస్ 16’ రియాలిటీ షోతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మరల ఖత్రోన్ కే ఖిలాడీ 13 వంటి రియాలిటీ షోలలో కూడా కనిపించింది.