• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

Kiara Advani Will Quit Cinema Industry: బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా కుటుంబ జీవితానికే పరిమితం కానున్నారా..? తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా, రాబోయే రెండో బిడ్డతో కలిసి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిందా..? ఈ నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందా.. ? ఈ రూమర్స్ బాగా నడుస్తున్న వేళ.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఇంతకీ టాక్సిక్ భామ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 24, 2026, 05:48 IST|Updated: Nov 24, 2026, 05:49 IST
joinshare
సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!
Image Credit: Kiara Advani (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!

2

కోలీవుడ్‌కు కలిసొచ్చిన 2027.. జైలర్ 2, వీరభద్రుడు, సీన్ సహా భారీ హిట్లు..

3

Ansal API: కోరమ్‌ లేక అన్సల్ ఏపీఐ ప్రమోటర్ల ఈజీఎం రద్దు.. తెరపైకి ఈ- ఓటింగ్ వివాదం

4

సనాతన ధర్మ పరిరక్షణ అంటే పురాతన దేవాలయాలను కూల్చివేయడమేనా? వైఎస్ జగన్..!!

5

హరీశ్ రావు అసలు గురువు కేసీఆర్ కాదు.. వైఎస్ఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kiara Advani: ‘కియారా అద్వానీ’ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లైనా సినిమాల్లో ఎక్కడా తగ్గడం లేదు. హాట్ ఇంటిమేట్ సీన్స్ ‌లో హద్దులు చెరిపేస్తోంది. ఇప్పటికే ఓ బిడ్డ తల్లిగా ఆలనా పాలనా చూసుకుంటునే..   త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలో  సినిమాలకు దూరమవుతుందని సోషల్ మీడియాలో భారీగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

ఈ వార్తలకు చెక్ పెడుతూ తనకు ఇష్టమైన కథలు, క్యారెక్టర్స్ ఎంచుకునే స్వాతంత్య్రం తనకుందని ఆమె చాలా స్ట్రాంగ్‌గా స్పష్టం చేసారు. తన కలలను  నెరవేర్చుకునే విషయంలో తనను ఎవరూ ఆపలేరంటూ నటనను వదిలే ప్రసక్తే లేదంటూ  కుండబద్దలు కొట్టింది.

ఈ మధ్యే భర్త సిద్ధార్థ్‌తో కలిసి 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' షోలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.  ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన ‘టాక్సిక్’ ఫ్లాపవ్వడం తనను మానసికంగా కుంగదీసిందనన్నారు. అందులోని రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ వల్ల తను ఎదుర్కొన్న ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి ఎమోషనల్ అవుతూ తన బాధను పంచుకున్నారు.

‘టాక్సిక్’ డిజాస్టర్ తర్వాత ఆన్‌లైన్ ట్రోలింగ్ వల్ల తాను ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పుకొచ్చింది.  ఆ టైమ్ తన కెరీర్‌లోనే టఫెస్ట్ ఫేజ్ అని కియారా తెలిపారు. అయితే ఆ కష్టకాలంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తనకు కొండంత అండగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. తన ప్రతి నిర్ణయంలో సపోర్ట్ చేస్తూ తనను ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడంలో సిద్ధార్థ్ చాలా హెల్ప్ చేశాడని కియారా చెప్పుకొచ్చారు.

ఇదే షోలో తమ లవ్ స్టోరీ గురించి చెప్తూ.. లస్ట్ స్టోరీస్ చూశాకే సిద్ధార్థ్‌కు తనపై ఇంట్రెస్ట్ కలిగిందని ఆమె ఫస్ట్ టైమ్ రివీల్ చేసారు. అప్పటినుంచి నైట్ క్లబ్స్, పార్టీల్లో తనను కలిసేందుకు అతను చాలా ట్రై చేసి ఫైనల్‌గా తన మనసు గెలుచుకున్నాడని కియారా మురిసిపోయారు. మొత్తానికి మదర్ హుడ్ అనేది తన యాక్టింగ్ కెరీర్‌కు ఎప్పుడూ బ్రేక్ వేయలేదని చెప్పుకొచ్చారు. ఇక కియారా 
సౌత్‌లో నటించిన సినిమాల్లో ‘భరత్ అను నేను’ సినిమా తప్పించి మరే సినిమా పెద్దగా నడవలేదు. రామ్ చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’, గేమ్ చేంజర్, యశ్‌తో చేసిన ‘టాక్సిక్’ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక దక్షిణాది హీరో ఎన్టీఆర్‌తో స్క్రీన్ చేసుకున్న ‘వార్ 2’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie