సినిమాలకు కియారా అద్వానీ బై బై.. ? క్లారిటీ ఇచ్చిన ‘టాక్సిక్’ భామ..!!
Kiara Advani Will Quit Cinema Industry: బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా కుటుంబ జీవితానికే పరిమితం కానున్నారా..? తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా, రాబోయే రెండో బిడ్డతో కలిసి పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయిందా..? ఈ నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందా.. ? ఈ రూమర్స్ బాగా నడుస్తున్న వేళ.. అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఇంతకీ టాక్సిక్ భామ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..?
Kiara Advani: ‘కియారా అద్వానీ’ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది. పెళ్లైనా సినిమాల్లో ఎక్కడా తగ్గడం లేదు. హాట్ ఇంటిమేట్ సీన్స్ లో హద్దులు చెరిపేస్తోంది. ఇప్పటికే ఓ బిడ్డ తల్లిగా ఆలనా పాలనా చూసుకుంటునే.. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరమవుతుందని సోషల్ మీడియాలో భారీగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
ఈ వార్తలకు చెక్ పెడుతూ తనకు ఇష్టమైన కథలు, క్యారెక్టర్స్ ఎంచుకునే స్వాతంత్య్రం తనకుందని ఆమె చాలా స్ట్రాంగ్‌గా స్పష్టం చేసారు. తన కలలను నెరవేర్చుకునే విషయంలో తనను ఎవరూ ఆపలేరంటూ నటనను వదిలే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టింది.
ఈ మధ్యే భర్త సిద్ధార్థ్‌తో కలిసి 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' షోలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన ‘టాక్సిక్’ ఫ్లాపవ్వడం తనను మానసికంగా కుంగదీసిందనన్నారు. అందులోని రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ వల్ల తను ఎదుర్కొన్న ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి ఎమోషనల్ అవుతూ తన బాధను పంచుకున్నారు.
‘టాక్సిక్’ డిజాస్టర్ తర్వాత ఆన్‌లైన్ ట్రోలింగ్ వల్ల తాను ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆ టైమ్ తన కెరీర్‌లోనే టఫెస్ట్ ఫేజ్ అని కియారా తెలిపారు. అయితే ఆ కష్టకాలంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా తనకు కొండంత అండగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. తన ప్రతి నిర్ణయంలో సపోర్ట్ చేస్తూ తనను ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడంలో సిద్ధార్థ్ చాలా హెల్ప్ చేశాడని కియారా చెప్పుకొచ్చారు.
ఇదే షోలో తమ లవ్ స్టోరీ గురించి చెప్తూ.. లస్ట్ స్టోరీస్ చూశాకే సిద్ధార్థ్‌కు తనపై ఇంట్రెస్ట్ కలిగిందని ఆమె ఫస్ట్ టైమ్ రివీల్ చేసారు. అప్పటినుంచి నైట్ క్లబ్స్, పార్టీల్లో తనను కలిసేందుకు అతను చాలా ట్రై చేసి ఫైనల్‌గా తన మనసు గెలుచుకున్నాడని కియారా మురిసిపోయారు. మొత్తానికి మదర్ హుడ్ అనేది తన యాక్టింగ్ కెరీర్‌కు ఎప్పుడూ బ్రేక్ వేయలేదని చెప్పుకొచ్చారు. ఇక కియారా
సౌత్‌లో నటించిన సినిమాల్లో ‘భరత్ అను నేను’ సినిమా తప్పించి మరే సినిమా పెద్దగా నడవలేదు. రామ్ చరణ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ’, గేమ్ చేంజర్, యశ్‌తో చేసిన ‘టాక్సిక్’ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇక దక్షిణాది హీరో ఎన్టీఆర్‌తో స్క్రీన్ చేసుకున్న ‘వార్ 2’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది.