Konidela Pawan Tej: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ ఫస్ట్ లుక్ విడుదల.. అమలాపురంలోనే సినిమా షూటింగ్!
Konidela Pawan Tej: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న కొణిదెల పవన్ తేజ్ తన కొత్త సినిమా ‘జంట’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల కలయికగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం ఘనంగా విడుదల చేసింది. ఈ వేడుకలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Konidela Pawan Tej: వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ యాదవ్ కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాడని కుమార్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా కావడం విశేషం. అరుణ్ పాండియన్, కల్పలత, నవీన్ నేని, అశోక్, శ్రావణ సంధ్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెట్ల రమణబాబు మాట్లాడుతూ, గతంలో ఎన్నో సినిమాల చిత్రీకరణకు వేదికగా నిలిచిన ఈ ప్రాంతంలో మరో సినిమా షూటింగ్ జరగడం సంతోషంగా ఉందన్నారు. పవన్ తేజ్‌కు ఇది హీరోగా రెండో సినిమా అని, ‘జంట’తో మెగా ఫ్యామిలీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలోని సహజ అందాలు సినిమా చిత్రీకరణకు ఎంతో అనుకూలంగా ఉంటాయని చెప్పారు. మరిన్ని తెలుగు సినిమాల షూటింగ్స్ ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు. స్థానికంగా సినిమాలు నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అమలాపురంలోని ప్రకృతి అందాలను చూస్తే దీనిని నేచర్ స్టూడియోగా చెప్పుకోవచ్చని అన్నారు.
నిర్మాత రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ, దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నామని వెల్లడించారు. కథకు సరిపోయే సహజమైన లొకేషన్ల కోసం అమలాపురాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. దర్శకుడు రాజశేఖర్ యాదవ్ ఈ కథను ప్రత్యేకంగా తెరకెక్కించగలరనే నమ్మకం ఉందని, ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఒక కొత్త తరహా దర్శకుడు పరిచయం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
హీరోయిన్ పాడని కుమార్ తనకు తొలి తెలుగు సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.
ఇక హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ, మొదట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని భావించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా చిత్రీకరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అమలాపురాన్ని ఎంచుకున్నామని తెలిపారు. సినిమా మొత్తం ఇక్కడే చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ కథపై తనకు ఎంతో నమ్మకం ఉందని, ఇతర సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పారు.
‘జంట’లో బలమైన ఎమోషన్స్‌తో పాటు మాస్ యాక్షన్ అంశాలు కూడా ఉంటాయని పవన్ తేజ్ వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా క్యాప్షన్ ‘యుద్ధం రాముడితో కాదు.. రాజ్యంతో’ అందరిలో ఆసక్తిని పెంచుతోందన్నారు. ఇప్పటివరకు చూడని కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
అమలాపురం నేపథ్యంలో తెరకెక్కనున్న ‘జంట’ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా పవన్ తేజ్ చెప్పిన క్యాప్షన్, కొత్త తరహా యాక్షన్ ఎలిమెంట్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.