SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..

KTR Tweet on Nani Paradise: నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. బుధవారం రాత్రి ప్రీమియర్స్‌తో విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సినిమాతో పాటు నానిపై ప్రత్యేకంగా ట్వీట్ చేయడం రాజకీయంగా ఆసక్తి రేకిత్తిస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 26, 2026, 03:57 PM IST | Updated: Sep 26, 2026, 04:02 PM IST
Image Credit: KTR Tweet on The Paradise Movie (ZEE Telugu News/Source)
Join

KTR About Nani Paradise Movie: నాని హీరోగా తెరకెక్కిన  ‘ది ప్యారడైజ్‌’  సినిమాను కేటీఆర్‌ చూడనున్నారు. యువ సంచలన దర్శకుడు ర్‌ శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్‌ చేశారు.   ఈ మూవీ విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరింది. ఈ సినిమాను బిగ్‌ స్క్రీన్‌పై చూడనున్నట్లు కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

చాలా ఏళ్ల తర్వాత తన ఫేవరేట్‌ యాక్టర్‌ నాని సినిమాను థియేటర్‌లో చూడబోతున్నట్లు తెలిపారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమాలో ప్రియదర్శి నటించిన మాజీ సీఎం కేసీఆర్‌ క్యామియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు చూడబోతున్నానని కేటీఆర్‌ పోస్ట్‌ పెట్టడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

మరోవైపు కలెక్షన్ల పరంగా ప్యారడైజ్ చిత్రం దూసుకుపోతోంది.  మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లపై పెద్దగా ప్రభావం కనిపించలేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నైజాంలో సూపర్ కలెక్షన్లతో రచ్చ లేపుతోంది. సినిమాపై కొంత నెగిటివ్ టాక్, ట్రోల్స్ జరుగుతున్నా.. కేటీఆర్‌ మాత్రం సినిమా చూడబోతున్నట్లు ప్రకటించిడంతో నానీ ఫ్యాన్స్‌ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. మరోవైపు ఈ సినిమాను బీఆర్ఎస్ శ్రేణులు భుజాలపై వేసుకొని థియేటర్స్‌లో తెగ చూస్తున్నారు. కొంత మంది ఆంధ్ర వాళ్లు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ కథపై విషం వెళ్లగక్కుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ సినిమాలో అన్న ఎన్టీఆర్ కూడా క్యామియో రోల్లో కాసేపు కనిపించడంపై తెలుగు దేశం శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. మొత్తంగా ఏపీ, తెలంగాణలో టీడీపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES