SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలుగు తెరపై మహాత్మ జ్యోతిరావు ‘ఫూలే’.. ఈ నెల 27న విడుదల..

Mahatma Jyotirao Phule movie dubbed: భారతీయ చరిత్రలో మహిళ విద్యకు పాటుపడిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే. ఈయన జీవితం ఎందరికో ఆదర్శం. అప్పట్లోనే మహిళ విద్య కోసం ఫూలే దంపతులు పోరాడారు. ఆయన నివాళిగా ‘ఫూలే’ సినిమా హిందీలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 27న రాబోతుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 08:07 IST | Updated: Nov 25, 2026, 17:12 IST
Image Credit: Phoole release in Telugu (X/Source)
Join

Phule Telugu Movie: 19వ శతాబ్ధంలో మహిళా విద్యను ప్రోత్సహించిన వారిలో జ్యోతిరావు ఫూలే ఒకరు. ఫూలేతో పాటు ఆయన భార్య సావిత్రి బాయి ఫూలే మహిళ విద్యకు సాధికారికతకు పాటుపడ్డారు. అప్పట్లో ఆడవాళ్లకు చదువుకోవడానికి పెద్దగా బయటకు వచ్చే వారు కాదు. ఇంట్లో కట్టుబాట్ల కారణంగా పెద్దగా చదువుకోలేకపోయారు. కొంత మంది ఇంట్లోనే చదువుకున్నవాళ్లున్నారు. అయితే సావిత్రి బాయి కంటే కొంత మంది మహిళలు కూడా మహిళ సాధికారికత, చదువుకు కోసం పాటుపడ్డ వాళ్లున్నారు.

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు..  కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా  పోరాడారు. అంతేకాదు విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన ఈ మహనీయుల జీవిత చరిత్ర ఎంతో  స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ముఖ్యంగా మహిళా విద్యకు మార్గం చూపుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం వారు సాగించిన పోరాటాన్ని వెండితెరపై అనంత్ మహదేవన్ అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతీక్ గాంధీ జ్యోతిరావు ఫూలే పాత్రలో ఒదిగిపోయారు. పత్రలేఖ సావిత్రి బాయి పాత్రలో నటించింది. మరాఠీ, హిందీలో తెరెక్కిన ఈ సినిమాను తెలుగులో డాక్టర్ రవిచంద్ర నిర్మాతగా రిలీజ్ చేస్తున్నారు. చేతన్ ఈ సినిమాకు మాటలు అందించారు.

వర్ధంతి సందర్భంగా మహనీయుడి జీవితానికి నివాళి!
నవంబర్ 28న మహాత్మా జ్యోతిరావ్ ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా  ఈ సినిమాను   ఆయన జీవితం, ఆశయాలు, సమాజం కోసం సాగించిన పోరాటాన్ని మెజారిటీ  ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫూలే దంపతులు ఎదుర్కొన్న అవమానాలు, అడ్డంకులు, చేసిన త్యాగాలు, విద్య, సమానత్వం కోసం వారు చేసిన కృషి ఈ సినిమాలో ప్రధానంగా ఉండనున్నాయి.

‘ఫూలే’ కేవలం ఒక బయోపిక్ మాత్రమే కాదు.. తరతరాలకు అందాల్సిన సామాజిక సందేశం. మహిళా విద్య, మానవ హక్కులు, సమానత్వం, మానవ గౌరవం, సామాజిక న్యాయం వంటి విలువలను గుర్తుచేసే చారిత్రక సత్యం. నేటి సమాజంలో మనం అనుభవిస్తున్న అనేక హక్కుల వెనుక గత తరాలు చేసిన పోరాటం ఈ సినిమాలో చూపించారు.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని వీక్షించి అభినందించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. వారి సామాజిక సేవ, జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు.

ఈ సినిమా విడుదల నేపథ్యంలో  హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో సోషల్ యాక్టివిస్ట్ విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రముఖ రచయిత పసునూరి రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పసునూరి రవీందర్ మాట్లాడుతూ.. ‘‘హిందీలో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న పొన్నం రవిచంద్ర కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

సోషల్ యాక్టివిస్ట్ విమలక్క మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి ఫూలే గ వేసిన పునాదులే కారణమన్నారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారన్నారు. సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చిత్ర నిర్మాత డాక్టర్ పొన్నం రవిచంద్ర సహా అందరు ఈ సినిమా గురించి మాట్లాడారు.  ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సునీల్ నారంగ్ కి, ఆడియోను విడుదల చేస్తున్న మధుర ఆడియో వారికి ధన్యవాదాలు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. నవంబర్ 27న ఎన్ని సినిమాలు విడుదలైనా, ‘ఫూలే’ ఒక విభిన్నమైన జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోందన్నారు. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి తీసుకురావడం మాకు ఎంతో హ్యాపీగా ఉందన్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES