SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mahesh Babu Favourite Food: మహేష్ బాబుకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..వెంటనే చెప్పేసిన సూపర్‌స్టార్!

Mahesh Babu Favourite Food: సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబుకు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Written By Vishnu Priya
Published: Oct 06, 2026, 03:21 PM IST | Updated: Oct 06, 2026, 03:26 PM IST
Join

Mahesh Babu Favourite Food: ఇటీవల ఈ ముగ్గురు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాత్రమే కాకుండా, వారి వ్యక్తిగత ఇష్టాల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తమకు ఇష్టమైన ఆహారం ఏమిటో చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంటర్వ్యూలో యాంకర్ ముగ్గురినీ తమకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగారు. దీనికి మహేష్ బాబు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే హైదరాబాద్ చికెన్ బిర్యానీ అని సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ చికెన్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని మహేష్ చెప్పారు.

మహేష్ సమాధానం విన్న యాంకర్ కూడా తనకు హైదరాబాద్ బిర్యానీ గురించి తెలుసని చెప్పారు. తాను ఇటీవలే హైదరాబాద్ చికెన్ బిర్యానీ తిన్నానని చెప్పడంతో అక్కడ సరదా వాతావరణం ఏర్పడింది. మహేష్ బాబు ఫేవరెట్ ఫుడ్ కూడా బిర్యానీనే అని తెలియడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.

ఆ తర్వాత ప్రియాంక చోప్రాను తనకు ఇష్టమైన ఫుడ్ గురించి అడిగారు. తనకు చాట్ అంటే చాలా ఇష్టమని ఆమె చెప్పింది. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్‌లో చాట్‌ను చాలా ఇష్టంగా తింటానని ప్రియాంక వెల్లడించింది. ఇక పృథ్విరాజ్ సుకుమారన్ తన ఫుడ్ ఛాయిస్ గురించి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి సముద్రం దగ్గర పెరిగినందున తనకు సీఫుడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా చేపల పులుసు తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు.

ఒకే ఇంటర్వ్యూలో ముగ్గురు స్టార్లు తమ ఫేవరెట్ ఫుడ్ గురించి చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. వారణాసి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

Read More: Janhvi Kapoor: టాలీవుడ్‌లోకి అనవసరంగా వచ్చిన జాన్వీ కపూర్.. వరుస వివాదాలతో పెరుగుతున్న డ్యామేజ్!

Read More: ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES