SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మమిత బైజు తెలుగు ఎంట్రీకి అంతా సిద్ధం.. ? ఏ సినిమాతో అంటే.. !!

Mamitha Baiju Telugu Movie: సౌత్‌లో తన అందంతో, నటనతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు మమిత బైజు. ఇప్పటి వరకు మలయాళం, తమిళ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ‘విశ్వనాథం అండ్ సన్స్’ పేరుకు తమిళ సినిమా అయినా.. అంతా తెలుగు వాళ్లే నటించారు. కానీ అఫిషియల్‌గా తమిళ రీమేక్‌గా ఇక్కడ రిలీజైంది. అయితే మమితా తాజాగా ఓ సెన్సేషనల్ ప్యాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌తోనే మమిత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్టు వార్థులు వస్తున్నాయి. ఇంతకీ మల్లూవుడ్ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఏ సినిమాతో ఉండనుంది. అసలు ఇందులో నిజమెంత..?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 07:10 AM IST | Updated: Oct 19, 2026, 07:11 AM IST
Image Credit: Mamitha Baiju (X/Source)
Join

Mamitha Baiju Tollywood Entry:‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌తో పాటు ఇమేజ్ సంపాదించుకుంది మమిత బైజు. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతుంది.  ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీల్లో ఒకరిగా మారిపోయారు. వరుస విజయాలతో తన మార్కెట్‌ని పెంచుకుంటూ పోతుంది ఈ మలయాళ భామ. తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలని చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న‘జై హనుమాన్‌’లో మమిత నటించబోతున్నారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

జై హనుమాన్ మూవీతో ఎంట్రీ.. 

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోన్న ‘జై హనుమాన్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనుండగా.. తేజ సజ్జా, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో మమిత కూడా భాగమైతే.. ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది.  కథలో ఈమె ఏ పాత్రలో నటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ  చేస్తే మండోదరి పాత్రనా.. లేకపోతే సీత పాత్ర చేస్తుందా అనేది ఆసక్తి పెరుగుతుంది.

వరుసగా క్రేజీ చిత్రాలతో ఫుల్ బిజీ..

2026లో తమిళంలో  జన నాయకుడు, విశ్వనాథ్ అండ్ సన్స్,  మలయాళంలో ‘బెతలహోం కుడుంబ యూనిట్’ వంటి సినిమాలతో మమిత పేరు మార్మోగిపోతుంది. ఇందులో ‘జన నాయకుడు’ సినిమా ఫ్లాఫైనా విజయ్ రాజకీయాల్లో వెళ్లే ముందు చేసిన ఆఖరి చిత్రం కావడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో సౌత్‌లో గుర్తింపు పెంచుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్ ఎంట్రీ కూడా కీలకంగా మారింది. నిజంగానే ‘జై హనుమాన్’‌తో మమిత గానీ ఎంట్రీ ఇస్తే.. ఈమె టాలీవుడ్ ఎంట్రీకి  అంతకు మించిన సినిమా మరోకటి ఉండదనే చెప్పాలి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES