• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Mana Doctor Baabe: మన డాక్టర్ బాబేకు రాజ్ తరుణ్ సపోర్ట్.. నవంబర్ 20న థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమా!

Mana Doctor Baabe: మన డాక్టర్ బాబేకు రాజ్ తరుణ్ సపోర్ట్.. నవంబర్ 20న థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమా!

Mana Doctor Baabe: టాలీవుడ్‌లో మరో చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. నవంబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటుడు అలీతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Written ByVishnu Priya
Published: Nov 17, 2026, 20:35 IST|Updated: Nov 17, 2026, 20:41 IST
joinshare
Mana Doctor Baabe: మన డాక్టర్ బాబేకు రాజ్ తరుణ్ సపోర్ట్.. నవంబర్ 20న థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమా!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mana Doctor Baabe: స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై కృతాక్షి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెరు చలపతి కుమార్ పువ్వల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్కంద ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మోహన సిద్ధి, శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ సినిమా నిర్మాణం వెనుక ఉన్న శ్రీ స్కంద, దర్శకుడు చలపతి కష్టాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దర్శకుడిపై నమ్మకంతో శ్రీ స్కంద సొంతంగా డబ్బులు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. సినిమా చిన్నదా, పెద్దదా అనే విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోరని అన్నారు. మంచి కథ, ఆకట్టుకునే కంటెంట్ ఉంటే తప్పకుండా ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు. నవంబర్ 20న విడుదలయ్యే ‘మన డాక్టర్ బాబే’ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని కోరారు.

ముఖ్య అతిథిగా వచ్చిన రాజ్ తరుణ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హీరోగా, నిర్మాతగా శ్రీ స్కంద చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. దర్శకుడు చలపతికి ఈ సినిమాతో మంచి విజయం దక్కాలని ఆకాంక్షించారు. సినిమాటోగ్రాఫర్ కిషోర్ పనితీరును కూడా ప్రశంసించారు. అలీతో కలిసి నటించే అవకాశం తనకు రాలేదని, అయితే ఆయనతో ఒకే వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. నవంబర్ 20న థియేటర్లలో ఈ సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరారు.

హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ ఇప్పటికే సినిమాకు ప్రీమియర్లు నిర్వహించామని వెల్లడించారు. సినిమా చూసిన వారు మంచి స్పందన ఇచ్చారని తెలిపారు. నవ్వులతో పాటు మంచి సందేశం, భావోద్వేగాలు కూడా సినిమాలో ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరినీ అలరించేలా దర్శకుడు చలపతి ఈ చిత్రాన్ని రూపొందించారని అన్నారు. ప్రేక్షకులు టికెట్ కోసం ఖర్చు చేసే డబ్బుకు తగిన వినోదం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన ప్రయాణంలో సహకరించిన నిర్మాత కృతాక్షి, గౌతమ్, మురళికి కృతజ్ఞతలు తెలిపారు.

దర్శకుడు చలపతి కుమార్ పువ్వల మాట్లాడుతూ శ్రీ స్కంద సహకారం వల్లే ఈ సినిమా పూర్తయిందని చెప్పారు. నిర్మాణ సమయంలో నిర్మాత కృతాక్షి ఎక్కడా రాజీ పడలేదని వెల్లడించారు. అలీ కామెడీ ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారని పేర్కొన్నారు.

నటీమణులు శృతి శంకర్, మోహన సిద్ధి కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హర్షవర్ధన్ సైతం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరి నవంబర్ 20న విడుదల కానున్న ‘మన డాక్టర్ బాబే’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
 

Read More: నార్త్ అమెరికాలో రామాయణం దెబ్బకు బాహుబలి రికార్డులు ఫసక్.. నెక్ట్స్ టార్గెట్ దురంధర్ 2..!!


Read More:Mirnalini Ravi Wedding: ఆధ్యాత్మిక గురువు మహావిష్ణువును పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరా బ్యూటీ? గుర్తుపట్టారా?

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie