SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మంచు విష్ణుతో ప్రభుదేవా మాస్టర్ ప్లాన్..! ఈ సారైన వర్కౌట్ అయ్యేనా..!!

Manchu Vishnu - Prabhu Deva: మంచు విష్ణు ఇండస్ట్రీకి వచ్చి 15 యేళ్లు గడుస్తున్న స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఎపుడూ అడపాదడపా కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ ‘కన్నప్ప’ సినిమాతో నటుడిగా మెప్పించినా.. అనుకున్నంత రేంజ్‌తో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుదేవాతో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 23, 2026, 14:59 IST | Updated: Nov 23, 2026, 15:01 IST
Image Credit: Manchu Vishnu - Prabhu Deva (Source/ZEE Telugu News)
Join

Manchu With Prabhu Deva: మంచు విష్ణుకు గతేడాది చేసిన ‘కన్నప్ప’ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి హీరోలు కెమియోలో నటించారు. ఇక ఈ సినిమాలో రుద్రగా ప్రభాస్ క్యారెక్టర్‌కు మంచి రెస్పానస్ వచ్చింది. ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు తాజాగా బర్త్ డే సందర్భంగా ప్రభుదేవాతో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.  

ప్రభుదేవా విషయానికొస్తే.. ఒకప్పుడు తన డ్యాన్స్‌తో యావత్ భారతీయ ప్రేక్షకులను అలరించారు. దర్శకుడిగా అలరించారు.  దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్స్ అందించినా...  ప్రస్తుతం రేసులో వెనకబడ్డాడు.  ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.ఆయనే ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.  అయితే ప్రభుదేవా దర్శకుడిగా ఇప్పటి వరకు పెద్దగా పొడిచిందేమి లేదు. అన్ని రీమేక్‌లతోనే హిట్ అందుకున్నాడు. కొత్తగా మంచు విష్ణును ఏం చూపించబోతున్నాడు. ఎలాంటి సబ్జెక్ట్‌తో మంచు వారి పెద్దబ్బాయిని ఒప్పించడానేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

విష్ణుతో ప్రభుదేవా ఎలాంటి కాంబినేషన్.. 
అయితే మంచు విష్ణుతో ప్రభుదేవా  ఎంట్రీ ఒక స్పెషల్ కాంబినేషన్‌తో ఉండబోతున్నట్టు సమాచారం.  హీరో మంచు విష్ణుతో కలిసి ప్రభుదేవా ఒక కొత్త సినిమాను ప్రకటించారు. మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రభుదేవా తన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు.

హ్యాపీ బర్త్‌డే టు మై హీరో అండ్ లిటిల్ బ్రదర్ విష్ణు మంచు.. ఈ వేడుకను VM24తో మరింత స్పెషల్‌గా, కలర్‌ఫుల్‌గా మార్చుకుందాం' అంటూ ప్రభుదేవా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. అంతేకాదు.. ప్రభుదేవా, మంచు విష్ణు కలిసి ఉన్న స్టైలిష్ ఫోటోను కూడా షేర్ చేశారు.

19 యేళ్ల తర్వాత తెలుగులో ప్రభుదేవా దర్శకత్వం.. 
ఈ ప్రకటనతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ కొత్త కాంబినేషన్‌పై ఆసక్తి మొదలైంది.ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ తెలుగు సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు.
 

గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు ప్రభుదేవా.అందులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మాత్రమే హిట్ అందుకుంది. పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్‌లు ఎంత పెద్ద డిజాస్టర్స్‌లో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుదేవాతో ప్రాజెక్ట్ అంటే పెద్దగా బజ్ మాత్రం లేదు. అలా అని తీసిపారేయలేము. మరి ప్రాజెక్ట్ అటు ప్రభుదేవాకు.. ఇటు మంచు విష్ణు ఇద్దరి కెరీర్‌కు కీలకం అని చెప్పాలి.

హీరోగా మంచు విష్ణు తమిళంలో ఎంట్రీ..

వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమాతో మంచు విష్ణు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోగా కూడా అరంగేట్రం చేయబోతున్నట్టు సమాచారం. చెన్నైలో పుట్టి పెరిగిన విష్ణుకు తమిళ భాషపై మంచి పట్టు ఉంది. ఇప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలో తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతుండటం మరో విశేషం.

మరోవైపు ఈ సినిమాను మంచు విష్ణు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మించనున్నట్లు సమాచారం.  అయితే మంచు విష్ణు గత కొన్నేళ్లుగా బయట బ్యానర్స్‌లో సినిమాలు చేయడం లేదు. తన  సొంత బ్యానర్‌లోనే సినిమాలు చేస్తున్నాడు.  అయితే ఈ సినిమా టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? ఇతర నటీనటులు ఎవరెవరు? కథ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై మేకర్స్ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇక ఇప్పటికే మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' సినిమాలో ప్రభుదేవా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇప్పుడు అదే పరిచయం దర్శకుడు, హీరో కాంబినేషన్‌గా మారడం విశేషం.మొత్తానికి ఒకవైపు డ్యాన్స్, మరోవైపు దర్శకత్వం.. ఇలా అన్ని రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. ఇప్పుడు మంచు విష్ణుతో ఎలాంటి సినిమా అందించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES